MLC Ananatha Babu Bail Petition: తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 17న ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ రద్దు కాగా.. తాజాగా రెండో బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు బెయిల్ అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. డ్రైవర్ హత్యకేసులో అనంతబాబు మే 23 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు అనంతబాబుకు బెయిల్ ఇవ్వొద్దని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు న్యాయపోరాటం చేస్తున్నారు. వారి తరఫున పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు కేసు వాదిస్తున్నారు.
ఇవీ చూడండి: