Minister Dadisetti Raja on Woman Suicide Attempt incident: తాడేపల్లిలోని సీఎం జగన్ కార్యాలయం సమీపంలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు. మహిళకు నిజంగా అన్యాయం జరిగి ఉంటే.. ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని వెల్లడించారు. కాకినాడ జిల్లా తునిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నా పేరు ఉపయోగించి.. నా దగ్గర పనిచేసే గన్‌మెన్ వల్ల ఏదో జరిగిందని టీవీలో వస్తుందని తెలిపారు. నా దగ్గర పని చేసే గన్‌మెన్‌ను మూడు నెలల క్రితమే తప్పించి.. కొత్త గన్‌మెన్‌ను ఇచ్చారని అన్నారు. ఇందులో నన్ను లాగుతూ.. లోకేశ్ ట్వీట్ చేయడం సరికాదన్నారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
అసలేం జరిగిందంటే: తాడేపల్లిలోని సీఎం జగన్ కార్యాలయం సమీపంలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. అచేతన స్థితిలో ఉన్న తన కుమార్తెను కాపాడాలని వేడుకునేందుకు ఆరుద్ర అనే మహిళ సీఎం కార్యాలయానికి వచ్చింది. కదల్లేని స్థితిలో ఉన్న తన కుమార్తెను వెంటబెట్టుకుని వచ్చిన ఆమె, సీఎం కార్యాలయం సమీపంలో ఆత్మహత్యాయత్నం చేసింది. కాకినాడ సమీపంలోని రాయుడిపాలేనికి చెందిన ఈమె.. కుమార్తె చికిత్స కోసం ఇల్లు అమ్ముకోనీకుండా మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్ బెదిరిస్తున్నారని సీఎం కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేసింది. సీఎంను కలిసేందుకు అనుమతించడం లేదన్న ఆమె.. ఇక న్యాయం జరగదనే ఆందోళనతో మణికట్టుపై కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.
ఇవీ చదవండి: