Hospital cheating : గర్భిణి అని చెప్పి తొమ్మిది నెలలు వైద్యం చేసి.. తీరా ప్రసవం సమయానికి కాదని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా గోకవరంకు చెందిన మహాలక్ష్మికి యానాంకు చెందిన సత్యనారాయణకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కాకినాడ గాంధీనగర్ లోని రమ్య ఆసుపత్రిలో ఈ ఏడాది జనవరిలో మహాలక్ష్మికి వైద్య పరీక్షలు చేయించారు. ఆమె గర్భవతి అని ఆసుపత్రిలో నివేదికలు ఇచ్చారు.
అప్పటి ఆసుపత్రిలో క్రమంతప్పకుండా ఆసుపత్రిలో స్కానింగ్ లు, వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడుకుంటున్నారు. ఈ నెల 22న ప్రసవం తేదీ కూడా ఇచ్చారు. మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా.. ఆమె గర్భవతి కాదని తేల్చారు. తిరిగి కాకినాడలోని రమ్య ఆసుపత్రికి వచ్చి నిలదీయగా పొంతనలేని సమాధానం చెప్పారని ఆమె తల్లి కమలాదేవి, కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన చెందారు.
ఇవీ చదవండి: