ETV Bharat / state

Protest: రాత్రికి రాత్రే కంచెలు.. నోటీసు బోర్డులు.. మత్స్యకారుల ఆందోళన

Fishermen Protest: కాకినాడ కుంభాభిషేకం చేపలరేవులో కంచె వేయడాన్ని నిరసిస్తూ మత్స్యకారులు నిరసనకు దిగారు. రాత్రికి రాత్రి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు ఇనుప కంచెలు వేశారంటూ అందోళనకు దిగారు. కుంబాభిషేకం రేవుని కాకినాడ పోర్టుకు కేటాయిస్తామంటూ బోర్డులు పెట్టారు. ఇనుప కంచను, స్థంభాలను తొలగించారు. అనంతరం పోర్టు కార్యాలయం వద్దకు చేరుకొని నిరసనకు దిగారు. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కొండబాబు మత్స్యకారులకు మద్దతుగా నిలిచారు.

Fisherman
Fisherman
author img

By

Published : May 2, 2023, 10:17 PM IST

మత్స్యకారుల నిరసన

Fishermen Protest: ఎన్నో ఏళ్ల నుంచి కాకినాడ కుంభాభిషేకం చేపలరేవు మీదే ఆధారపడి మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. ఆ స్థలంలో రాత్రికి రాత్రే కంచెలు, నోటీసు బోర్డులు చూసి మత్స్యకారులు ఆగ్రహానికి గురయ్యారు. తమ స్థలంపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కన్నుపడిందని.. ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కంచెలు, బోర్డుల్ని తొలిగించి పోర్టు కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన వారికి.. మాజీ ఎమ్మెల్యే కొండబాబు మద్దతు తెలిపారు.

కాకినాడ కుంభాభిషేకం చేపలరేవు వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాతలకాలం నుంచి కుంభాభిషేకం చేపలరేవుపై ఆధారపడి మత్స్యకారులు బతుకుతున్నారు. ఆ స్థలాన్ని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని... మత్స్యకారులు ఆందోళనకు దిగారు. చెరువు వద్ద వేసిన బోర్డులు, ఫెన్సింగ్ ను మత్స్యకారులు తొలగించారు. బోర్డుల్ని పీకిపారేసి మహిళలు... తమ స్థలంలో.. అధికారులు కంచెలు, బోర్డుల్ని ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆక్రమణను నిరసిస్తూ మత్స్యకారుల కాకినాడ పోర్టు కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత్స్యకారులను విచ్ఛిన్నం చేసే కుట్రకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెరదీశారని మండిపడ్డారు. ప్రశ్నించిన వాళ్లను అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల కోసం కాకుండా తన స్వార్ధం కోసమే ద్వారంపూడి అధికారాన్ని వాడుకుంటున్నాడని... మాజీ ఎమ్మెల్యే కొండబాబు విమర్శించారు. మత్స్యకారుల ఆందోళనకు కొండబాబు మద్దతు తెలిపారు. రేవుని కాపాడాలని మత్స్యకారులతో కలిసి అధికారులకు వినతిపత్రం అందించారు.

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ప్రత్యేకంగా మత్స్యకారులనే టార్గెట్ చేస్తూ.. ఈ మత్స్యకారుల కులాన్ని విచ్ఛిన్నం చేయాలి. మత్స్యకారులను అంతా చిన్నాభిన్న చేసి రాజకీయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ రోజు కుంభాభిషేకం చేపలరేవు భూములు దోచే కార్యక్రమాన్ని తలపెట్టుకున్నాడు. -మత్స్యకారుడు

రాత్రికి రాత్రే స్తంభాలేసి అక్కడున్న మా మత్స్యకారుల సోదరీమణులను భయభ్రాంతులకు గురిచేశారు. మేము ఇవాళ ఉదయం మత్స్యకారులకు అండగా ఉండి వాళ్ల చేతనే స్థంభాలను తొలగించడం జరిగింది. మా తాతల కాలం నుంచి బతుకుతున్న ఈ చేపలరేవులో మేము ప్రవేశించకూడదని బోర్డుల్నిపెట్టడానికి సిగ్గు లేదా..?- మత్స్యకారుడు

బ్రీటీష్ కాలం నుంచి ఉన్న చేపలరేవది. తాత ముత్తాత్తాల నుంచి అక్కడే వేటాడుకొని అక్కడే బతికేవారు. అలాంటి ప్రాంతాన్ని వీళ్లని ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేని నేను అడుగుతున్నా..ఏంటి ఎమ్మెల్యే నువ్వు ప్రజల కోసం పని చేస్తున్నావా లేక నీ కోసం పని చేసుకుంటున్నావా..? ప్రజల నుంచి ఇంత అలజడి వస్తుంటే గతాన్ని గుర్తు చేసుకోవాలి కదా నువ్వు - మాజీ ఎమ్మెల్యే కొండబాబు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.