కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణానికి తాగునీరు సరఫరా చేసే మంచి నీటి చెరువులో భారీగా చేపలు మృతి చెందడం కలకలం రేపింది. చిత్రాడలో 44 ఎకరాల విస్తీర్ణంలోని మంచి నీటి చెరువులో రెండు రోజులుగా చేపలు, పాములు చనిపోతున్నాయి. కాగా ఈ నీటినే పిఠాపురంలోని మూడు ట్యాంకులకు పంపించి.. పట్టణంతోపాటు, శివారు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. చనిపోయిన చేపల్ని.. పురపాలక సంఘ అధికారులు పూడ్చి పెట్టారు.
చెరువులోని నీరు కలుషితమవ్వడం వల్లే చేపలు, ఇతర జీవులు మృత్యువాత పడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. అదే నీటిని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు అధికారులు మాత్రం వాతావరణం చల్లబడి చేపలు చనిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు.
ఇదీ చదవండి:
'అలాంటి పిటిషన్ వేసే ముందు ఆలోచించాలి..'
బ్యాక్‌లెస్ డ్రెస్‌లో హాట్‌గా జాన్వీ.. మతిపోగొట్టేస్తున్న కియారా