అన్నవరం సత్యనారాయణ స్వామి ములవిరాట్కి వజ్ర కిరీటం సిద్ధమైంది. పెద్దాపురం శ్రీ లలితా ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ మట్టే సత్యప్రసాద్ కిరీటాన్ని తయారు చేయించారు. 682 గ్రాముల బంగారం, 3,764 వజ్రాలు, కెంపు, పచ్చలతో ప్రముఖ వ్యాపార సంస్థతో కిరీటాన్ని తయారు చేయించారు. ఈ వజ్ర కిరీటాన్ని ప్రత్యేక పూజలు అనంతరం స్వామి వారి మూల విరాట్‌కు అలంకరించనున్నారు.
ఇవీ చూడండి