CM Jagan Tour In Kakinada : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాకినాడ పర్యటనకు ప్రజలను భారీగా తరలించారు. సభ ప్రాంగాణానికి ఉదయం 7 గంటలకే వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి రాక ఆలస్యంతో ప్రజలు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొందరు ప్రజలు అక్కడి నుంచి బయటకు వెెెళ్లేందుకు ప్రయత్నించారు. సభా ప్రాంగణం నిండిపోవడంతో బయట ఎండలో వేచి ఉన్నవారు తీవ్ర ఆసౌకర్యానికి గురయ్యారు. సభా వేదిక, హెలీప్యాడ్ లాంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ట్రాఫిక్ నిబంధనలతో అటుగా వెళ్లిన ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోన్నారు.
బుధవారం రోజున కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రంగరాయ వైద్య కళాశాల మైదానంలో నిర్వహించిన పింఛన్ల పెంపు, పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి సభకు ఉదయమే ప్రజలను తరలించగా, సభ ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. వందల సంఖ్యలో బస్సుల ద్వారా భారీగా ప్రజలను సమీకరించారు.
వైఎస్సార్సీపీ రిజర్వుడు స్థానాల్లో రెడ్లదే పెత్తనం
ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రసంగ సమయంలో ఖాళీ కుర్చీలే: పింఛన్ల పెంపు సభ వేదికపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ప్రసంగం ప్రారంభంకాగానే, అధిక సంఖ్యలో ప్రజలు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభయ్యే సరికి ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సభా ప్రాంగణంలో చిన్నారులు, చంటి పిల్లలతో వచ్చిన మహిళలు అవస్థలు పడ్డారు. వేదిక వద్ద నుంచి బయటకు వచ్చేవారు. బయట నుంచి వేదిక వద్దకు వెళ్లేవారు ఒకేమార్గం ద్వారా రావడంతో అవస్థను ఎదుర్కొన్నారు.
ప్రాంగణం లోపలకు వచ్చిన వారిని తర్వాత బయటకు వెళ్లకుండా ఇనుప గ్రిల్‌తో దారి మూసేశారు. బయటకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో విసుగు చెందిన కొందరు మహిళలు బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు. బారికేడ్లను తొలిగించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఓ మహిళ కాలికి గాయమై తీవ్ర రక్తస్రావమైంది. అంతేకాకుండా కరపకు చెందిన 65 ఏళ్ల రామారావు అనే వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు. సభా ప్రాంగణం వద్దనున్న వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.
ఎంత బలంగా ఉన్నామో జగన్‌లోని భయమే చెప్తోంది : పవన్
7గంటలకు రావాల్సిందే లేకపోతే మీ ఇష్టం: ముఖ్యమంత్రి సభకు తప్పకుండా ఉదయం 7గంటలకే రావాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో దిక్కుతోచని స్థితిలో చిన్నారులతో సహా మహిళలు తరలివచ్చి, ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యమంత్రి ఆర్ఎంసీ మైదానం చేరుకునే సరికి ఉదయం 11 గంటల సమయం దాటింది.
సీఎం జగన్ రైతులను ముంచారు : ఏలేరు ఆధునీకరణకు దొంగ హామీలు ఇచ్చి సీఎం పిఠాపురం రైతాంగాన్నీ నిలువునా ముంచారని మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. కాకినాడకు సీఎం పర్యటన నేపథ్యంలో పిఠాపురం నుంచి తెలుగుదేశం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున బయల్దేరారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పిఠాపురం తెలుగుదేశం కార్యాలయం నుంచి మెయిన్ రోడ్ మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్‌పై నిరసన ర్యాలీ చేపట్టగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వర్మ తాహశీల్దార్ కార్యాలయం ముందే రోడ్డుపై బైఠాయించారు. ఏలేరు ప్రాజెక్టు పాపంలో ఎంపీ వంగా గీత, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబులు భాగస్వాములని ఆరోపించారు. ఏలేరు నీటిని తాండవకి అమ్ముకుని రైతుల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు.
ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్ కసరత్తు - త్వరలోనే మారిన అభ్యర్థుల జాబితా