ETV Bharat / state

టీడీపీలో కొత్త వ్యవస్థ.. ఇకపై 30 కుటుంబాలకు సాధికార సారథులు - tdp gruha Sadhikara Sarathi program

TDP Sadhikara Saaradhi: పార్టీలో కుటుంబ సాధికార సారథుల పేరిట కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి 30 కుటుంబాలకు ఈ సాధికార సారథులు ఇన్ఛార్జ్​లాగా వ్యవహరిస్తారన్నారు. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇంచార్జులందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామని తెలిపారు. సాధికార సారథులుగా మహిళలకూ సమ ప్రాధాన్యం ఇస్తామన్నారు.

TDP Sadhikara Saaradhi
కుటుంబ సాధికార సారథి
author img

By

Published : Feb 16, 2023, 4:09 PM IST

Updated : Feb 16, 2023, 4:18 PM IST

Chandrababu on Sadhikara Saaradhi: కాకినాడ జిల్లా జగ్గంపేటలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ తరఫు నుంచి కుటుంబ సాధికార సారథుల పేరు మీద కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిచనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని చంద్రబాబు అన్నారు. ప్రజలంతా సైకోను ఇంటికి పంపాలని నిర్ణయించారని చెప్పారు. రాజకీయాల్లో ఉండే అర్హత జగన్‌కు ఏ మాత్రం లేదని చంద్రబాబు తెలిపారు. జగన్‌ను చూసి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. జగన్‌ ఉంటే రాష్ట్రానికి బ్లేడ్‌, గంజాయి బ్యాచ్‌లు రావాల్సిందే అంటూ ఎద్దేవా చేశారు.

కుటుంబ సాధికార సారథులు: పార్టీలో కుటుంబ సాధికార సారథుల పేరిట కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి 30 కుటుంబాలకు ఈ సాధికార సారథి ఇన్ఛార్జ్​లాగా వ్యవహరిస్తారన్నారు. ఆర్ధిక అసమానతలు తొలగించేలా ఈ సారథులు పని చేస్తారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు పని చేసిన వారికి అనుకున్న స్థాయిలో న్యాయం చెయ్యలేకపోయామన్న చంద్రబాబు,.. ఈ సారి అలా జరగకుండా పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇంచార్జ్​లు అందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామని తెలిపారు. సాధికార సారథులుగా మహిళలతూ సమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందన్నారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఈ విభాగం పని చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇకపై ఎన్నికల కోసం కాకుండా సమాజాన్ని ముందుకు తీసుకుపోయేందుకు.. కుటుంబ సాధికార సారథులను తీసుకుంటున్నాం. 25 వేల ఓట్లకు ఓ క్లస్టర్ గా తీసుకున్నాం. 5 వెేలకు ఓట్లకు ఓ యునిట్ గా పెట్టినట్లు తెలిపారు. 50 నుంచి 100 ఓట్ల కోసం ఓ కుటుంబ సాధికార సారథిగా నియమించే ప్రయత్నాలు చేస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందే విధంగా ఈ వ్యవస్థను రూపొందిస్తాం. చంద్రబాబు, తెలుగుదేశం అధినేత

ఇప్పటికే వైసీపీ నేతలు తమ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే గృహసారథుల నియామించే ప్రక్రియ చేపట్టింది. అటు వైసీపీ ఇటు టీడీపీ పోటాపొటీగా ప్రజల నాడీ పట్టే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గృహసారథులు, సాధికార సారథుల ప్రభావం ఎలా ఉంటుందనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 16, 2023, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.