SC Categorisation Bill: పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలంటూ.. ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) ఆధ్వర్యంలో కాకినాడలో చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్, ధర్నా చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లారు. లోపలికి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్యాదం చోటు చేసుకుంది. బారికేడ్లు నెట్టుకుంటూ లోపలకు వెళ్లేందుకు కార్యకర్తలు తీవ్రంగా యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసనల కారణంగా కలెక్టరేట్లో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎమ్మార్పీఎస్ కన్వీనర్ వల్లూరి సత్తిబాబు మాదిగ, రాష్ట్ర కార్యదర్శి నూకరాజు మాదిగ, కో కన్వీనర్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయకపోవడం అత్యంత దారుణమని నాయకులు అన్నారు. రాష్ట్రంలో ఎస్సీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా.. విధి విధానాలు రూపొందించలేదని ఆరోపించారు. తక్షణం మాదిగ కార్పొరేషన్ కు నిధులు కేటాయించి.. మాదిగలందరినీ ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఇవీ చదంవడి: