ETV Bharat / state

తాడేపల్లిలో ఎస్సై బాలకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు... - తాడేపల్లి తాజా వార్తలు

మహిళను మోసగించిన ఓ ఎస్సైపై పోలీసు అధికారులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు.. ఎస్సై తనను మోసగించాడంటూ ఆత్మహత్యకు యత్నించింది.

Zero FIR against si Balakrishna
ఎస్సై బాలకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్
author img

By

Published : Jul 25, 2021, 4:08 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి ఎస్సై బాలకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఎస్సై బాలకృష్ణ తనను మోసం చేశారంటూ ఓ మహిళ తాడేపల్లి స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆ మహిళపై నీళ్లు పోసి పక్కకు తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటేనే వీఆర్​కు పిలిచారు. గుంటూరు నగరంలోని ఓ పోలీస్ స్టేషన్​లో బాలకృష్ణ పని చేస్తున్న సమయంలోనూ ఇదే మహిళా తనను మోసం చేశారంటూ ఫిర్యాదు చేశారు. అప్పుడు బాలకృష్ణపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. తర్వాత తాడేపల్లికి బదిలీ చేశారు. ఈనెల 23 రాత్రి తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మళ్లీ అదే మహిళ ఆత్మహత్యకు యత్నించింది. బాలకృష్ణ మోసం చేశారని ఆరోపించారు. దీనిపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇదీ చదవండీ.. PM PRAISES YOUNGMAN: తిరుపతి యువకుడికి ప్రధాని మోదీ ప్రశంస

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.