ETV Bharat / state

దివ్యాంగ వాలంటీర్‌పై వైకాపా నేతల దౌర్జన్యం

author img

By

Published : Jan 30, 2021, 8:33 AM IST

దివ్యాంగ వాలంటీర్​పై వైకాపా నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఈ వివాదం తలెత్తింది. ఈ ఘటనలో వాలంటీర్ ఆత్మహత్య ప్రయత్నం చేశారు.

దివ్యాంగ వాలంటీర్‌పై వైకాపా నేతల దౌర్జన్యం
దివ్యాంగ వాలంటీర్‌పై వైకాపా నేతల దౌర్జన్యం
దివ్యాంగ వాలంటీర్‌పై వైకాపా నేతల దౌర్జన్యం

గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం పంచాయతీ ఎన్నికల్లో ఆరో వార్డు నుంచి తన తల్లిని పోటీ చేయించమంటే నిరాకరించినందుకు వైకాపా నేతలు తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని దివ్యాంగ వాలంటీర్‌ మౌలాలి ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి నాగేశ్వరరావుతో కలిసి మౌలాలి శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. 'వైకాపా నేతలు తాండ్ర సాంబశివరావు, సూరినేని మురళీకృష్ణ, కుంటా రత్నబాబు, సూరయ్య, మాడా శ్రీనివాసరావు.. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుతో మా అమ్మను ఎన్నికల్లో పోటీ చేయించాలని అడిగారు. పొలం పనులు చేసుకుని బతికే మాకు రాజకీయాలు వద్దని చెప్పా. మేం అడిగితే ఎన్నికల్లో పోటీ చేయబోమంటావా? నిన్ను వాలంటీర్‌ ఉద్యోగం నుంచి తప్పించి అంతు చూస్తామంటూ వైకాపా నేతలు బెదిరించారు. దౌర్జన్యం చేసి, నా అంగ వైకల్యంపై దుర్భాషలాడారు. గ్రామంలో లేకుండా చూస్తామనటంతో భయపడి ఆత్మహత్యకు యత్నించా. ఇంతలో మా నాన్న వచ్చి అడ్డుకున్నారు.' అని వాపోయారు.

పోటీ నుంచి తప్పుకోవాలంటూ బెదిరింపులు

కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి తెదేపా మద్దతుతో పోటీ చేస్తున్న తనను బరిలో నుంచి తప్పుకోవాలంటూ వైకాపా నేతలు తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్నారని బాపట్ల పద్మ అనే మహిళ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల నుంచి వైదొలగకుంటే తన భర్తపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపిస్తామని భయపెడుతున్నారని వాపోయారు. కర్లపాలెం ఎస్సై అంజయ్యను 'ఈటీవీ భారత్​' సంప్రదించగా దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. సిబ్బందితో వెళ్లి గ్రామాన్ని పరిశీలించి వచ్చానని తెలిపారు.

ఇదీ చదవండి:

నేనెప్పుడూ పరిధి దాటలేదు: ప్రవీణ్‌ ప్రకాశ్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.