YSRCP Government Stopped NTR Baby Kit Scheme : నవజాత శిశువులు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా సంరక్షణకు ఉపయోగపడే బేబీ కిట్ల (NTR Baby Kit Scheme) పంపిణీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపేసింది. తెలుగుదేశం ప్రభుత్వం (Telugu Desam Government) హయాంలో ప్రవేశ పెట్టిన బేబీ కిట్ పథకాన్ని అర్ధాంతరంగా నిలిపి వేసింది. దీని వల్ల ఏటా సుమారు 4లక్షల మంది చంటి బిడ్డలు ఈ కిట్లు అందకుండా పోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు.
Infant care Situation in YCP Government : గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా నాణ్యమైన వైద్యం అందేలా చేయాలని.. ఈ ఏడాది అక్టోబరులో సీఎం జగన్ సూచించినా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నం. శ్రీరంగ నీతులతో సీఎం జగన్ (CM Jagan).. చెల్లెమ్మలను మోసం చేస్తున్నారు. శిశువుల సంరక్షణకు ఉపయోగపడే బేబీ కిట్ పథకం అమలును నిలిపేశారు. ఫలితంగా శిశువుల సంరక్షణ (Infant care)కు అవసరమైన కిట్ల కొనుగోలుకు అదనంగా వేయి రూపాయల వరకు తల్లిదండ్రులు వ్యయం చేస్తున్నారు.
NTR Baby Kit Scheme Name Changed to YSR Baby Kit Scheme by CM Jagan : ప్రభుత్వాసుపత్రులకు ఎక్కువగా వచ్చేది పేదలే. ఇక్కడ జన్మించే ప్రతి శిశువుకు బేబీకిట్ పంపిణీ పథకాన్ని టీడీపీ హయాంలో 2016 జులై 1 నుంచి ప్రారంభించారు. ఈ పథకానికి NTR బేబీ కిట్ అని పేరు పెట్టారు. ప్రసవాలు జరిగే ప్రతి ప్రభుత్వాసుపత్రిలో కిట్లను శిశువులు సంరక్షణ కోసం బాలింతలకు అందజేసేవారు. ఈ కిట్లలో దుప్పటి, దోమతెర, స్లీపింగ్ బెడ్, బేబీ పౌడర్, యాంటీ సెప్టిక్ లోషన్, బేబీ లోషన్, న్యాప్కిన్, డైపర్స్, చిన్న బొమ్మలు, షాంపులు, అవసరమైన దుస్తులు ఉండేవి. దీని వల్ల తల్లిదండ్రులకు ఆర్ధికంగా ఉపశమనం లభించింది. ఈ కిట్ల ద్వారా ఉచితంగా ఇచ్చే వస్తువులను మార్కెట్లో కొనుగోలు చేయాలంటే వేయి రూపాయలకుపైగా వ్యయం చేయాల్సి వచ్చేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ పథకానికి అప్పటి వరకు ఉన్న NTR బేబీ కిట్ పేరును తొలగించి YSR బేబీ కిట్‌గా నామకరణం చేశారు. పేరు మార్చడంలో పెట్టిన శ్రద్ధ పథకం కొనసాగింపు విషయంలో చూపించలేదు.
PRATHIDWANI సంక్షేమ పథకాల ఏరివేత వెనుక ప్రభుత్వ ఎజెండా ఏంటి
CM Jagan Government Careless on Pregnant Women and Infant care : శిశువుల సంరక్షణ కోసం ఉపయోగపడే ఈ కిట్ పంపిణీకి అవసరమైన నిధులు తక్కువే అయినా ఆర్థికశాఖ కొర్రీలు వేసిందన్న కారణంతో 2021లో పథకాన్ని పూర్తిగా అటకెక్కించారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల సంరక్షణ గురించి ముఖ్యమంత్రి జగన్ సమీక్ష సమావేశాల్లో మాత్రం ఆర్భాట ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా జరిగిన సమీక్షలో పోషకాహారాన్ని గర్భిణులు తీసుకుంటున్నారా? లేదా? రక్తహీనత సమస్య తగ్గుతుందా ? లేదా? అనే దానిపై దృష్టి సారించాలని.. అంగన్వాడీల్లో పోషకాహారాన్ని అందిస్తున్న సమయంలోనే గర్భిణులు, పిల్లలకు టీకాలు అందించారా? లేదా? పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా? పోషకాహార లోపం రాకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఆచరణలో మాత్రం ఇవి నామమాత్రంగా అమలవుతున్నాయి.