ETV Bharat / state

Bhima Mitra: "హామీలు సరికదా.. కనీసం సమస్యలనూ పరిష్కరించలేదు"

author img

By

Published : Jun 26, 2023, 10:31 AM IST

Promises to Bhima Mitra: నేను విన్నాను.. నేను ఉన్నానంటూ ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్ని విస్మరించినట్లుగా అనిపిస్తోంది. వైఎస్సార్​సీపీ ఇచ్చిన హామీలను గమనిస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారం చేతికి వచ్చిన తర్వాత మరోలా వైఎస్సార్​సీపీ ఉందని రుజువవుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదు. హామీల మాట అటు ఉంచితే కనీసం సమస్యలైనా పరిష్కరించలేదని బీమా మిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat
రోడ్డునపడ్డ బీమా మిత్రలు

YCP Government not fulfilled given Promises to Bhima Mitra: మాట తప్పను మడమ తిప్పను అని చెప్పే జగన్‌ నాలుక ఎన్ని మడతలేస్తుందో చెప్పడానికి.. బీమా మిత్రల పొట్ట కొట్టడమే పెద్ద ఉదాహరణ అని ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. నెలకు 3 వేల రూపాయల గౌరవ వేతనం సహా వెయ్యి రూపాయల ప్రోత్సాహకం ఇస్తానని చెప్పి.. ఏకంగా 1600 మందిని రోడ్డున పడేసిన ముఖ్యమంత్రి జగన్‌ ఏం సమాధానం చెబుతారని ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

"బీమా మిత్రలకు గౌరవ వేతనం కింద ప్రతి నెలా 3 వేల రూపాయలిస్తాం. క్లెయిమ్‌ అప్‌లోడ్‌ చేసిన వెంటనే వెయ్యి రూపాయలు ప్రోత్సాహకాన్ని అందిస్తాం". ఇది 2019 జులై 2న బీమా మిత్రలకు ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ. "జగన్‌ మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా, ఎన్నికలైన తర్వాత మరో మాదిరిగా, ఎన్నికల కోసం ఇంకోలా ఉండేవాడు కాదు మీ జగన్‌. మీ బిడ్డకు నిజాయితీ ఉంది. మీ బిడ్డకు నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో...అదే చేస్తాడు" అంటూ 2022 జూన్‌ 14వ తేదీన పత్రికల్లో భారీ ప్రకటనల్లోనూ ముఖ్యమంత్రి జగన్‌ ఉద్ఘాటించారు.

మహిళా సాధికారత సాధించేది వైఎస్సార్​సీపీనే.. మహిళలకు తాము చేస్తున్న మేలు మరే ప్రభుత్వమూ చేయలేదనే విధంగా గొప్పలు చెబుతుంటారు సీఎం జగన్‌. మంత్రులు, వైఎస్సార్​సీపీ ప్రజాప్రతినిధులు ఇంకో అడుగు ముందుకేసి జగన్‌ మహిళా పక్షపాతి అని, గొప్ప సంస్కరణవాది అని కీర్తించడంలో ఒకరినొకరు పోటీ పడుతుంటారు. జగన్‌ ‘చెప్పాడంటే.. చేస్తారంతే’ అని ఊదరగొట్టేస్తుంటారు. అంత గొప్ప ప్రభుత్వమే అయితే.. దశాబ్ద కాలంగా బీమా మిత్రలుగా పని చేసిన డ్వాక్రా మహిళల విషయంలో ఎందుకు మాట తప్పారని బాధిత మహిళలు నిలదీస్తున్నారు. సాధికారత అంటే ఉన్న ఉపాధిని తీసేసి మహిళల్ని రోడ్డున పడేయడమేనా అని ప్రశ్నిస్తున్నారు. చేసిన పనికి కనీసం డబ్బులు కూడా చెల్లించకపోవడమా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో క్లెయిమ్‌కు 150 ఇచ్చేవారని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నెలకు 7 వేల నుంచి 30 వేల దాకా ఆదాయం వచ్చేదని బీమా మిత్రలు తెలిపారు. ఆ డబ్బుతో కుటుంబం గడిచేదని, పిల్లలను చక్కగా చదివించుకోగలిగామన్నారు. జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక మూడు వేలు రూపాయలిస్తామని చెప్పి హామీ ఇచ్చి మోసం చేశారని వాపోతున్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన లక్షా 20 వేలు రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలేదని శ్రీసత్యసాయి జిల్లా బీమా మిత్రలు ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజులు కట్టలేక బీటెక్‌ చదువుతున్న అబ్బాయిని, నర్సింగ్‌ చదువుతున్న అమ్మాయిని కళాశాలలకు పంపడం లేదని మాధవీ లత అనే బీమా మిత్ర ఆవేదన వ్యక్తం చేశారు.

" నేను 2012లో బీమా మిత్రగా చేరాను. అప్పుడు నెలకు 700 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో 1000 రూపాయలు ఇచ్చారు. మాకు ముఖ్యమంత్రి జగన్​ నెలకు మూడు వేలు జీతం ఇస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను నేరవేర్చలేదు. మాకు ఇల్లు గడవటమే కష్టంగా ఉంది." -బీమా మిత్ర

"రాష్ట్రంలో ఉన్న బీమా మిత్రలకు గత ప్రభుత్వం కనీసంగా ఇంతా అని ఇచ్చేది. క్లైయిమ్​కు ఇంతా అని కొద్ది మొత్తంగా ఇచ్చేది. దీనివల్ల వారికి పెద్ద మొత్తంలో చేతికి వచ్చేది. దీంతో సౌకర్యవంతంగా ఇల్లు గడిచేది. కానీ, వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు గౌరవ వేతనంగా ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత హామీలను అటు ఉంచి.. సమస్యలను పరిష్కారమే మరిచిపోయారు." -మురళి, సీఐటీయూ నేత

చంద్రబాబు ప్రభుత్వం మండలానికి ఇద్దరు, పట్టణాల్లో జనాభాను బట్టి 10 మందికి ఒకరు చొప్పున బీమా మిత్రలకు బాధ్యతలను అప్పగించింది. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చే నాటికి బీమా మిత్రలుగా1600 మందికి పైగానే పని చేసేవారు. జగన్‌ సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత మొదట్లో రకరకాల కొర్రీలతో కోత వేశారు. వీఓఏలు, ఆర్​పీలు, బీమా మిత్రలుగా ఒకరే ఉండకూడదని చెప్పి కొందరిని తప్పించారు. చివరకు 1350 మంది మిగలగా వీరినీ 2021లో విధుల నుంచి తప్పించి రోడ్డున పడేశారని బాధితులు వాపోతున్నారు. ఒంటరి మహిళలు, వితంతువుల మొరనూ ఆలకించలేదని, కన్నీళ్లకు కరగలేదని గోడు వెల్లబోసుకుంటున్నారు.

"వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి మండలానికి ఒకరు ఉండేవారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మండలానికి ఇద్దర్ని నియమించారు. కానీ, ఈరోజు వారికి నెలకు మూడు వేల రూపాయలు, అదనంగా మరో వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి 1600 మందిని మోసం చేశారు." -అన్నపూర్ణమ్మ, శ్రామిక మహిళ నాయకురాలు

టీడీపీ హయాంలో కుటుంబ పెద్దను కోల్పోయిన నిరుపేద బాధిత కుటుంబానికి చంద్రన్న బీమా పథకం అండగా నిలిచింది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు, సహజ మరణమైతే కుటుంబానికి 2 లక్షలు ఇచ్చేవారు. బీమా మిత్రలు నెలలోపే సాయం అందించేవారు. అసంఘటిత రంగ కార్మికులను ప్రాతిపదికగా తీసుకుని 2.54 కోట్ల మందికి టీడీపీ ప్రభుత్వం బీమా వర్తింప చేసింది. కానీ వైసీపీ అధికారంలోకొచ్చాక..బీమా పథకానికి వైఎస్సార్‌ పేరును చేర్చింది. కుటుంబంలోని సంపాదించే వ్యక్తి’ అనే నిబంధన నిబంధనను తీసుకు వచ్చి బీమా వర్తించే వారి సంఖ్యను కుదించింది. సహజ మరణానికిచ్చే ఆర్థిక సాయాన్ని లక్షకు తగ్గించింది. 2021-22 కాలానికి అసంఘటితరంగ కార్మికుల్లో కేవలం 1. 48 కోట్ల మందికే బీమా నమోదు చేసినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.