ETV Bharat / state

AP Farmers: అన్నదాతకు మాటల్లోనే సాయం.. చేతల్లో చేతులెత్తేస్తున్న వైఎస్సార్​సీపీ ప్రభుత్వం - ఏపీలో రైతు ఆత్మహత్యలు

YSRCP Government on Farmers: మన రాష్ట్రంలో రైతు కుటుంబాలకు భరోసా లేకుండా పోతోంది. పొరుగు రాష్ట్రమైనా తెలంగాణలో రైతు బీమా కింది ఇచ్చింది 4,658 కోట్ల రూపాయలు. రైతు ఏ కారణంతో మరణించిన అక్కడ సహాయం అందుతోంది. కానీ, మన రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం.. రైతు ఆత్మహత్యలకే ఆర్థిక సాయం. అది నాలుగు సంవత్సరాల్లో ఇచ్చింది కేవలం 47 కోట్ల రూపాయలే. ఎన్నో నిబంధనలు, సాకులతో ప్రభుత్వం ఆర్థిక సాయ తిరస్కరణకే మొగ్గు చూపుతోంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 14, 2023, 8:14 AM IST

YSRCP Government Neglecting Farmers: రైతు దినోత్సవం అంటూ.. ఏటా అన్నదాతలకు ఇలాంటి మాటలే చెప్తున్న జగన్‌ సాయం వరకు వచ్చేసరికి ఉత్త చేతులే చూపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునే విషయంలో పొరుగునున్న.. తెలంగాణ ప్రభుత్వం కొండంత సాయం చేస్తోంది. వైఎస్సార్​సీపీ సర్కార్‌ గోరంత సాయం చేస్తూ.. కొండంత ప్రచారం చేసుకుంటోంది. 2018 ఆగస్టు నుంచి తెలంగాణలో 93 వేల 170 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ఆ ప్రభుత్వం రైతు కుటుంబాలకు 4వేల 658 కోట్లు బీమాగా అందించింది. ఇందుకోసం ఎల్​ఐసీ ప్రీమియంగా చెల్లించిన మొత్తమే.. 5 వేల 384 కోట్ల రూపాయలు. కానీ.. సీఎం జగన్‌ నాలుగేళ్ల పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చిన సాయం 47 కోట్లు మాత్రమే. అది కూడా కేవలం 672 కుటుంబాలకే ఇచ్చి.. చేతులు దులుపుకున్నారు.

సీఎం సాయం మాటల వరకే: నిజానికి తెలంగాణతో పోల్చితే ఏపీలోనే రైతులు ఎక్కువగా ఉన్నారు. సాగు విస్తీర్ణం కూడా ఎక్కువే. మన రాష్ట్రంలో మొత్తం 85లక్షల మందికిపైగా రైతులున్నారు. తెలంగాణతో పోలిస్తే దాదాపు 20లక్షల మంది రైతులు ఎక్కువే అన్నమాట. నాలుగేళ్లుగా రాష్ట్రంలో వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన లక్షలాది కుటుంబాలు.. అప్పుల ఒడిలోకి చేరాయి. నామమాత్ర పెట్టుబడి రాయితీ, అరకొర పంటల బీమా తప్పితే వారిని ఆదుకుందామనే ఆలోచనే రాష్ట్రంలో కొరవడింది. తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుబాలకు ప్రభుత్వాలు అందించిన సాయంలో ఇంత వ్యత్యాసం ఎందుకుంది.. మన రాష్ట్రంలో రైతుల సంఖ్య ఏమైనా తక్కువా అంటే అదేమీలేదు. కారణం ఒకటే. మన సీఎం మాటల్లో సాయం చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వ సాయం చేతల్లో కనిపిస్తోంది.

రైతును ఆదుకోవాలనే ఆలోచన..! పాలకుడికి నిబద్దత ఉండాలని, అలాంటి నైతికత ఉంటే ఆ గుండెను జగనన్న అంటారంటూ నిత్యం తన వీపు తానే చరచుకునే సీఎం.. నాలుగేళ్ల తన పాలనలో రైతు ఆత్మహత్యల కుటుంబాలకు ఇచ్చిన సాయమెంతో తెలుసా? కేవలం 672 కుటుంబాలకు రూ.47 కోట్ల రూపాయలు మాత్రమే. వాస్తవంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. ఇతర కారణాలతో అంటూ తిరస్కరిస్తున్నారు. మన పొరుగునే ఉన్న తెలంగాణలో కేవలం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకే కాకుండా.. రైతు ఏ కారణంతో చనిపోయినా వారి కుటుంబాలకు అండగా నిలుస్తోంది. తమది రైతుల ప్రభుత్వమంటూ పొద్దస్తమానం ప్రచారం తప్పితే.. నిజంగా రైతును ఆదుకుందామనే ఆలోచనే ఆంధ్రప్రదేశ్‌లో కన్పించడం లేదు. అందుకు రైతు బీమా గణాంకాలే అద్దం పడుతున్నాయి.

ఆత్మహత్య చేసుకుంటేనే సాయం: నైతికత, నిబద్దతకే గుండె ఉంటే అది తనలా ఉంటుందనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. వివిధ కారణాలతో చనిపోయే రైతులు, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునే అన్నదాతల గుండెఘోష వినిపించుకోవటం లేదు. రైతు ఏ కారణంతో చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా.. పొరుగునే ఉన్న తెలంగాణ ప్రభుత్వం పది రోజుల్లో 5లక్షల రూపాయలు రైతు బీమా అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయంతో అప్పులపాలైన రైతు ఆత్మహత్య చేసుకుంటేనే.. 7లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. దానికీ కొర్రీలపై కొర్రీలే.

వాస్తవంగా చనిపోయే రైతుల సంఖ్యతో ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలా తక్కువ మందికే అందుతోందని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరిశీలనలో తేలింది. రైతు ఆత్మహత్యలపై ‘ఈనాడు’ నిర్వహించిన పరిశీలనలోనూ ఇదే విషయం రుజువైంది. ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 70% మంది కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని తిరస్కరిస్తున్నారు. వ్యవసాయ సంబంధిత సమస్యలతో కాకుండా ఇతర కారణాలతో చనిపోయారని రుజువు చేయడం ద్వారా.. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల సంఖ్య తక్కువగా ఉందని చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

పథకాలు అంతతా మాత్రమే: కౌలు రైతుల గోడు పట్టించుకున్న దాఖలాలే లేవు. కౌలు రైతుల్లో 8.8% మందికి మాత్రమే రుణ అర్హత కార్డులు(సీసీఆర్‌సీ) అందుతున్నాయి. కార్డు లేకపోతే.. రైతు ఆత్మహత్య చేసుకున్నా, అతను రైతే కాదని అధికారులు తిరస్కరిస్తున్నారు. తెలంగాణలో రైతు కుటుంబాలకు అందించిన సాయంతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో అందించిన సాయం 1% మాత్రమే. తెలంగాణలో మొత్తం రైతులు 65 లక్షల మంది ఉండగా.. అందులో 50 లక్షల మందికి రైతు బీమా వర్తింపజేస్తున్నారు. రాష్ట్రంలో 85లక్షల మంది రైతులు ఉండగా.. వారికి ప్రత్యేక బీమా పథకం అనేదే లేదు. వైఎస్‌ఆర్‌ బీమా అమలు చేసినా.. దాని రూపంలోనూ రైతులకు అందేది నామమాత్రమే.

రాష్ట్రంలో రైతు చనిపోతే ఆర్థికసహాయానికి ప్రభుత్వం విధించిన నిబంధనలు.. అచరణలు

  • అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకుంటేనే.. రూ. 7లక్షలు సాయం అందించాలని ప్రభుత్వం 2019 అక్టోబరు 14న ఉత్తర్వులు ఇచ్చింది. వ్యవసాయాధారిత కారణాలతో అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటేనే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. 2019 జులై నుంచి 2022-23 వరకు రూ.47 కోట్లు అందజేసింది.
  • గ్రామ రెవెన్యూ అధికారి పరిశీలన, మండల తహసీల్దారు ఛైర్మన్‌గా వ్యవసాయాధికారి కన్వీనర్‌గా ఎస్సై సభ్యుడిగా ఉన్న కమిటీ, డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓ/సబ్‌ కలెక్టర్‌ అధ్యక్షతన ఏడీఏ(వ్యవసాయ సహాయ సంచాలకులు) కన్వీనర్, డీఎస్‌పీ సభ్యుడిగా ఉండే కమిటీ విచారణ చేసి రైతు ఆత్మహత్యగా గుర్తించి సాయానికి సిఫారసు చేయాలి. తప్పుడు క్లెయిమ్‌లను నిరోధించే విషయంలో మండల, డివిజన్‌ స్థాయి కమిటీలు.. అన్ని రకాల చర్యలూ తీసుకోవాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆచరణ: రైతు ఆత్మహత్యా? కాదా? అని తేల్చేందుకే వారాలు, నెలలు పడుతోంది. బాధిత కుటుంబాన్ని సతాయిస్తున్నారు. కౌలు రైతులైతే కార్డులు తప్పనిసరి చేశారు. అవి లేవనే కారణంతో వందలాది మందిని ఆర్థిక సాయానికి దూరం చేశారు. రకరకాల నిబంధనలతో రైతు ఆత్మహత్య కాదని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

  • రైతు ఆత్మహత్య కేసుల్లో ఆయా కుటుంబాలకు సాయం అందించేందుకు కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌ స్థాయి అధికారిని ఇన్‌ఛార్జిగా నియమించాలి.

ఆచరణ: అధికారి ఎవరో, ఫోన్‌ నంబరు ఏమిటో జిల్లాలోని తహసీల్దార్లకే తెలియదు. ఇక రైతులకు తెలిసేదెక్కడ?

  • కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలి. రైతు ఒత్తిడిలో ఉన్నారనే విషయాన్ని స్వయంగా రైతు/ఆయన స్నేహితుడు, బంధువు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తెలియజేస్తే.. కలెక్టరేట్‌ నుంచి ఆర్డీవో, తహసీల్దారు వరకు అందరూ స్పందిస్తారు. రైతు కుటుంబంతో సంప్రదించి తగిన కౌన్సిలింగ్‌ ఇస్తారు. రుణదాతల ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగించేలా ఒక ప్యాకేజి అమలు చేస్తారు.

ఆచరణ : రైతు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం విషయంలోనే సతాయిస్తున్నారు. ఇక అప్పుల బాధలో ఉన్నాం ఆదుకోమంటే విన్పించుకునే పరిస్థితి ఉంటుందా? అని రైతులే పేర్కొంటున్నారు. ఆ హెల్ప్‌లైన్‌ ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు.

రాష్ట్రంలో రైతుకు భరోసా కరవు: రాష్ట్రంలో వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన లక్షలాది కుటుంబాలు అప్పుల ఒడిలోకి చేరాయి. గతనాలుగు సంవత్సరాలుగా వారికి నామమాత్ర పెట్టుబడి రాయితీ, అరకొర పంటల బీమా తప్పితే వారిని ఆదుకుందామనే ఆలోచనే కొరవడింది. నిజానికి నిద్ర లేచింది మొదలు.. రాత్రి మళ్లీ కునుకు తీసే వరకు రైతుకు పొలం ఆలోచన తప్ప మరేమీ ఉండదు. వ్యవసాయంలో నిత్యం కత్తిమీద సాము చేయాల్సిందే. పాముకాటు, పురుగుమందుల ఘాటు.. విద్యుదాఘాతాలు, వర్షాలు, వరదలు, పిడుగులు.. ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. దీనికితోడు పంటల సాగులో నష్టాలు, నెత్తిపై ఏటికేడు పెరిగే అప్పుల కుంపటితో అడుగు ముందుకు వేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కారణం ఏదైనా.. యజమాని చనిపోయినా, మంచాన పడినా.. కుటుంబమంతా రోడ్డున పడుతుంది. పిల్లల చదువులపై ప్రభావం పడుతుంది. పంటల సాగుకు పెట్టుబడికి పైసా ఉండదు. అలాంటప్పుడే రైతు చేయిపట్టుకు నడిపిస్తూ, తోడు నిలిచే నాయకుడు కావాలి. మేమున్నామనే భరోసా ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వంలో అలాంటి భరోసా రైతుకు లభిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నిజంగా ఒరిగేదేమీ లేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.