Tenali Council Meeting Attack : అధికార వైసీపీ పాలనలో ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వారు చేసే అవినీతి ప్రశ్నిస్తున్నందుకు దాడులకు తెగబడుతున్నారు. గొంతెత్తి ప్రశ్నించిన వారి పట్ల రౌడిల్ల ప్రవర్తిస్తున్నారు. తెనాలి పట్టణంలో శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు.. టీడీపీ కౌన్సిలర్‌పై దాడికి దిగారు. కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్న వేళ అవినీతిని ప్రశ్నించినందుకు.. దాడులకు తెగబడ్డారు. తోటి కౌన్సిలర్లు నిలువిరించేందుకు ప్రయత్నించిన ఆగకుండా పదే పదే ముష్టిఘాతాలకు దిగారు. దీంతో టీడీపీ నేతలు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్లి వివరాలు సేకరించారు.
గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాల్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. టీడీపీ కౌన్సిలర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నవరత్నాల పథకంలో భాగంగా గడప గడప పనుల్లో.. సింగిల్ టెండర్ ఆమోదం తెలిపారని టీడీపీ నేతలు ఆరోపించారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ అనే వ్యక్తి అభ్యంతరం తెలిపారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడకుండా కూర్చోమని మాటలతో ఎదురుదాడికి దిగారు. దీంతో తనకు మాట్లాడే అవకాశం లేదా మీరు కూర్చోండి అని బదులిచ్చారు. దీంతో అగ్రహానికి గురైన 33వ వార్డు కౌన్సిలర్ దాడికి దిగాడు. దీంతో కొద్దిసేపు కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దాడి చేస్తున్న సమయంలో మిగతా కౌన్సిలర్లు అడ్డుకున్న ఆగకుండా దాడి చేశాడు. అడ్డుకోవాలని ప్రయత్నించిన ఆగకుండా వెంటపడి పదే పదే ముష్టిఘాతాలు కురింపించాడు. అనంతరం వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. టీడీపీ కౌన్సిలర్లు మేయర్ పోడియం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేదే లేదని పోడియం వద్ద నేలపై బైఠాయించారు. దాడికి దిగిన కౌన్సిలర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ మాట్లాడుతూ.. నలుగురు వైసీపీ కౌన్సిలర్లతో తనకు ప్రాణ హాని ఉందని అన్నాడు. రక్షణ కల్పించాలని కోరాడు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ వరకు నిరసనగా ర్యాలి చేపట్టారు. స్టేషన్ ముందు బైఠాయించారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదు అని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి వివరాలు సేకరించారు.
ఇవీ చదవండి :