ETV Bharat / state

YSR Yantra Seva Scheme మాదే ప్రభుత్వం.. మాకే యంత్రాలు..! ఇదే గ్రామస్వరాజ్యం అంటున్న జగన్​.. - AP Latest News

Yantraseva Scheme will Benefit Only YCP Leaders: పార్టీ పేరు వైఎస్సార్​.. యంత్ర సేవ పథకం పేరూ వైఎస్సార్​ అందుకే వైసీపీ నేతలు దాన్ని సొంత పార్టీ పథకంలా మార్చేసుకున్నారు. ప్రభుత్వ రాయితీతో ఏర్పాటు చేసిన యంత్రాలను అధికార పార్టీ నేతలు ఆరగించేస్తున్నారు.

ysr_yantra_seva_scheme
ysr_yantra_seva_scheme
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 10:03 AM IST

Updated : Aug 26, 2023, 12:37 PM IST

Yantraseva Scheme will Benefit Only YCP Leaders: జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన వైఎస్సార్​ యంత్రసేవ పథకం వైసీపీ నేతల సేవలోనే తరిస్తుంది. 90 శాతానికి పైగా అధికార పార్టీ నేతలు, వారి అనుచరులే.. సంఘాలు ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న 3 వందల 66 కోట్ల రాయితీలో అధిక భాగం వైసీపీ నేతలే పొందారు. కొన్నిచోట్ల పథకం ద్వారా పొందిన యంత్రాలను వైసీపీ నేతలు అమ్ముకుంటున్న.. అడిగే పరిస్థి లేదు. ప్రభుత్వ రాయితీతో ఏర్పాటు చేసిన యంత్రాల కేంద్రాలను అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు కట్టబెట్టడాన్ని.. గ్రామ స్వరాజ్యమంటారా అనే విమర్శ లు వ్యక్తమవుతున్నాయి.

YCP leaders Corruption: 'వైఎస్సార్ యంత్ర సేవ'.. సచివాలయానికి రాకుండానే ట్రాక్టర్ మాయం

Distribution Program of Tractors Under YSR Yantra Seva Scheme: 10 వేల 4 వందల 44 ఆర్బీకేల పరిధిలోనూ కస్టమ్ హైరింగ్ కేంద్రాల పేరుతో ట్రాక్టర్లతో కూడిన వ్యవసాయ పనిముట్లను అతి తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తెచ్చాం. గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన అర్థం చెప్పే రోజు ఇదే.. అంటూ గుంటూరులో జూన్ 2న వైఎస్సార్​ యంత్ర సేవ పథకం కింద ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ చెప్పుకొచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పథకం అమలులో మాత్రం పరిస్థితి సీఎం మాటలకు భిన్నంగా ఉంది. పార్టీ పేరు వైఎస్సార్​ యంత్ర సేవ పథకం పేరూ వైఎస్సార్​ అందుకే వైసీపీ నేతలు దాన్ని సొంత పార్టీ పథకంలా మార్చేసుకున్నారు. మొక్కుబడిగా అయిదుగురితో సంఘాన్ని ఏర్పాటు చేసుకుని రాయితీపై ఇచ్చే యంత్రాలను ఆరగించేశారు.

YCP Leaders Attack on TDP Leaders in Srikakulam: వైసీపీ నేతల భూ కబ్జా.. అడ్డుకున్న టీడీపీ నేతలపై దాడి

Establishment of Rental Machine Centers Within RBK: వ్యవసాయ శాఖ రైతులంటే వైసీపీ వారే అన్నట్లుగా అధికార పార్టీ సంఘాలనే ఎంపిక చేసి వెయ్యి 52.18 కోట్ల విలువైన యంత్రాలను 40 శాతం రాయితీపై అందించింది. అద్దె ప్రాతిపదికన, రైతులకు తక్కువ ధరకే యంత్ర పరికరాలను అందించేందుకే ప్రతి ఆర్బీకే పరిధిలో అద్దె యంత్ర కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధిక శాతం యంత్రాలు నేతల వద్దే ఉన్నాయని తెలిసినా రాజకీయ జోక్యంతో ఏమీ మాట్లాడలేక పోతున్నామని అధికారులు చేతులెత్తేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో మొక్కుబడిగా బోర్డులు తగిలించడం తప్పితే.. అవి రైతులకు అందుతున్నాయా లేదా అనే అంశాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. కొన్నిచోట్ల యంత్రాలను అమ్ముకున్నా మరికొన్ని చోట్ల సొంతానికి వినియోగించుకుంటున్నా మిన్నకుంటున్నారు.

Yantra Seva Scheme Across the State: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అద్దె యంత్ర కేంద్రాల్లో వైసీపీ నేతల హవా సాగింది. సంఘాలు ఏర్పాటు చేసుకుని వారి సొంతానికో, బంధువులు, అనుచరులకు వీటిని కట్టబెట్టారు.

  • వైఎస్సార్​ జిల్లా ఒంటిమిట్టలో 9 అద్దె యంత్ర కేంద్రాలకు ట్రాక్టర్లు, ఇతర పరికరాలు సరఫరా చేశారు. వంద శాతం వైసీపీ నేతలకు చెందిన సంఘాలకే ఇవి దక్కాయి. వాటిలో రెండు చోట్ల ట్రాక్టర్లను అమ్మేశారు. మరో మూడు చోట్ల అక్రమంగా మట్టి, ఇసుక రవాణాకు వాడుతున్నారు. ఇటీవల ఒక ట్రాక్టర్‌ను అధికారులు పట్టుకుని జరిమానా విధించారు. మిగిలిన యంత్రాలు, ట్రాక్టర్లు వైసీపీ నేతల ఇళ్లలోనే ఉన్నాయి.
  • విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో 21 ఆర్బీకేలు ఉండగా.. 14 చోట్ల అద్దె యంత్ర కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇందులో 90 శాతానికి పైగా ట్రాక్టర్లు, యంత్ర పరికరాలన్నీ అక్కడి వైసీపీ నేతలు, వారి బంధువుల ఇళ్లలోనే ఉన్నాయి.
  • నంద్యాల గ్రామీణంలో 17 అద్దె యంత్ర కేంద్రాలు ఉండగా.. 12 చోట్ల స్థానిక నేతల చేతిలోనే యంత్ర పరికరాలు ఉన్నాయి. అద్దెకు ఇచ్చే పరిస్థితే లేదు.
  • డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో క్లస్టర్ స్థాయిలో ఇచ్చిన వరి కోత యంత్రాలు అధిక భాగం వైసీపీ నేతలకే దక్కాయి.
  • అనంతపురం జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అద్దె యంత్రాలు ఉన్న సంగతే తెలీదంటూ రైతులు వాపోయారు.

YSRCP Leaders Running Silica Sand Business in AP: చేతులు మారిన సిలికా దందా.. నేరుగా వైసీపీ చేతుల్లోకే..

YCP Leaders are Selling Machinery in some Places: నిబంధనల ప్రకారం ఆర్బీకే పరిధిలోని రైతులందరికీ ట్రాక్టర్లు, యంత్ర పరికరాలను తక్కువ అద్దెపై ఇవ్వాలి. వ్యవసాయ శాఖ నిర్ణయించిన ధరలనే అమలు చేయాలి. అయితే చాలా ఆర్బీకేల్లో ధరల బోర్డులే లేవు. కొన్నిచోట్ల ఉన్నా.. యంత్రాలు ఇచ్చే పరిస్థితి లేదు. సంఘం పేరుతో తీసుకున్న యంత్రాలన్నీ నేతల ఇళ్లలోనే ఉన్నాయని వారే సొంతానికి వినియోగించుకుంటున్నారని రైతులు, అధికారులు పేర్కొంటున్నారు. వీటిని పొందిన వారు అద్దె ధరలు ఏమాత్రం తగ్గించడం లేదు. ఎకరా గొర్రు తోలాలంటే 600 రూపాయల నుంచి 700, నాగలి దున్నాలంటే 2 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.

Officials not Taking Action: రాయలసీమ, కోస్తాల్లో కొన్నిచోట్ల ట్రాక్టర్లు ఎక్కడున్నాయో కూడా అధికారులు, ఆర్బీకే సిబ్బందికి తెలియదు. అమ్ముకున్నారని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఎక్కడెక్కడ యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయో వాటన్నిటినీ నమోదు చేయమంటున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా నేతలపై ఒత్తిడి తెచ్చి వాటిని అద్దెకు ఇప్పించడం సాధ్యమవుతుందా.. అనే ప్రశ్న సిబ్బందిలో వ్యక్తమవుతోంది. యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నా ఏవో కొన్నిచోట్ల తప్పితే అందులో ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు కనిపించడం లేదు.

YSR Yantra Seva Scheme మాదే ప్రభుత్వం.. మాకే యంత్రాలు..! ఇదే గ్రామస్వరాజ్యం అంటున్న జగన్​..

Last Updated : Aug 26, 2023, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.