ETV Bharat / state

సిరిపురం ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి - సిరిపురం వద్ద రోడ్డు ప్రమాదం తాజా వార్తలు

సిరిపురం వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవీన్​​ అనే యువకుడు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సకాలంలో ఆసుపత్రికి తీసుకువస్తే కాపాడేవారమని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఘటనపై మెడికొండ్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

youth died in an acccident happened at siripuram junction in guntur district
గాయపడిన యువకుడు నవీణ్​ మృతి
author img

By

Published : Aug 7, 2020, 9:23 AM IST

పక్కింటి వారికి సాయం చేసేందుకు తన ద్విచక్రవాహనం తీసుకుని తోడుగా వెళ్లిన ఓ యువకుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. పెదకూరపాడు డాబా సెంటర్​లో నివసించే చిన్నం సుధాకర్ భాగ్యలక్ష్మి దంపతులకు నవీన్​​కుమార్​, ప్రవీణ్ కుమార్​ కవల పిల్లలు ఉన్నారు. నవీన్​​కుమార్​ డిగ్రీ చదిని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. లాక్​డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్నాడు. వ్యాపారం చేసుకునేందుకు దుకాణం సిద్ధం చేస్తుకున్నాడు. పక్కింట్లో ఉండే వనజకు మెడికొండ్రు మండలం పేరేచర్ల బ్యాంకులో పని పడింది. ఆమెకు తోడుగా ద్విచక్ర వాహనం తీసుకొని నవీన్ కుమార్ పేరేచర్ల వెళ్ళాడు. పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీన్​ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం గుంటూరు ఆసుపత్రిలో మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకుని చేతికి అందివచ్చిన కుమారుని మరణవార్త విని తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై మెడికొండ్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

108 రాకపోవడంతో...

తీవ్రంగా గాయపడిన నవీన్​కుమార్​ 108కి ఫోన్​ చేశాడు. కానీ వారు సకాలంలో రాకపోవడంతో గంటపాటు ప్రమాద స్థలంలో బాధతో విలవిలలాడాడు.. సమాచారం అందుకున్న మెడికొండ్రు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు అక్కడే మృతి చెందాడు. సకాలంలో వైద్యం అంది ఉంటే ప్రాణ నష్టం జరిగేది కాదని వైద్యులు తెలిపినట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.