ETV Bharat / state

ఉద్యోగాలు భర్తీ చేయాలని యువజన సంఘాల ఆందోళన..అడ్డుకున్న పోలీసులు - గుంటూరు జిల్లా తాజా వార్తలు

ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలంటూ గుంటూరు జిల్లాలో యువజన సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ నేతలను గృహ నిర్బంధం చేశారు. వామపక్ష అనుబంధ సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై భైఠాయించిన యువకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

student-unions-protest
student-unions-protest
author img

By

Published : Jun 28, 2021, 11:51 AM IST

గుంటూరు జిల్లాలో భాజపా, తెదేపా, వామపక్ష యువజన, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని యువజన సంఘాలు నేడు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో హోం మంత్రి ఇంటి ముట్టడికి బిజేవైఎం పిలుపునిచ్చింది. దీంతో ముందస్తుగా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరి కొందరిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు కాపలా ఉన్నారు. అలాగే వామపక్ష అనుబంధ సంఘాలు కలెక్టరేట్ ముట్టడించాలని నిర్ణయించాయి. దీంతో ఆదివారం రాత్రే ఆయా సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వామపక్షాల కార్యాలయాల వద్ద పోలీసులు కాపలాగా ఉన్నారు.

ఉద్యోగాలు భర్తీ చేయాలని యువజన సంఘాల ఆందోళన

తెదేపా యువజన సంఘాల నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గుంటూరు జిల్లా తెలుగు యువత నాయకుడు రావిపాటి సాయి కృష్ణకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే అడ్డుకున్నారు. ఉద్యోగాల కోసం ఉదమిస్తున్న యువజన విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్ట్​లు, నోటీసులతో భయపెట్టాలని చూడటం సరికాదన్నారు. తమ ఆందోళనలను ప్రభుత్వం.. పోలీసులతో భగ్నం చేయాలని చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని ఖండించారు. నిరుద్యోగులకు జగన్ ఇచ్చిన హామీలు సాధించేవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'దేశానికి పీవీ చేసిన సేవలు చిరస్మరణీయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.