గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో.. శనివారం ఎడతెరపి లేని వర్షం కురిసింది. చిలకలూరిపేట మండలం మానుకొండవారి పాలెం-వేలూరు మధ్య ఉన్న కుప్పగంజి వాగు చప్టాపై ఎగువ కురిసిన వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వేలూరు గ్రామానికి చెందిన దాసు అనే యువకుడు చిలకలూరిపేట నుంచి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తూ వాగు దాటే క్రమంలో నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయాడు. మధ్యలో చెట్టును పట్టుకొని వేలాడుతూ ప్రాణాలు కాపాడుకునేందుకు పెద్దగా కేకలు వేశాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పురపాలక చైర్ పర్సన్ షేక్ రఫాని, పోలీస్, రెవెన్యూ , అగ్నిమాపక అధికారులు యువకుడిని కాపాడారు. యువకుడు ప్రాణాలతో బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: కథనానికి స్పందన... అడంగల్‌లో మార్పులు చేసిన అధికారులు