గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అంజుం... జనపనార బ్యాగుల తయారీలో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇంటర్మీడియట్ వరకూ చదివిన అంజుం....స్వయం శక్తితో ఎదగాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే... సొంతంగా ఏదైనా చేతివృత్తుల యూనిట్ ప్రారంభించాలని భావించారు. చిన్నప్పటి నుంచి పర్యావరణంపై మక్కువ ఉండటంతో... తాను చేసే పని పర్యావరణానికి మేలు చేసేలా ఉండాలని తలచారు.
ఆ ధృడ సంకల్పతోనే... జనపనార బ్యాగుల తయారీపై హైదరాబాద్ లోని ఎలీప్ లో రెండు నెలల శిక్షణ తీసుకున్నారు. కొన్ని బ్యాగులు తయారు చేసి బంధుమిత్రులకు ఇవ్వగా... వారి నుంచి ప్రశంసలు లభించాయి. మరో అడుగు ముందుకేసి.... 50వేల రూపాయల పెట్టుబడితో ఇంటిపైనే చిన్నపాటి యూనిట్ ప్రారంభించారు. మహిళలు ఉపయోగించే అన్నిరకాల బ్యాగులను తయారు చేస్తున్నారు.
ఈ బ్యాగులు పర్యావరణహితం..
జనపనారతో తయారు చేసే ఈ బ్యాగులు పర్యావరణహితం. ఈ బ్యాగులు... బహుమతులు ఇచ్చేందుకు, ల్యాప్ ట్యాప్‌లు పెట్టుకునేందుకు.... ఇలా ప్రతి అవసరాలకు తగిన విధంగా... రూపొందిస్తున్నారు. బ్యాగుల తయారీతో మహిళలకు ఉపాధి కూడా లభిస్తుందని... అంజుం తెలిపారు.
జనపనార సంచులు పర్యావరణ పరిరక్షణకు ఉపయెగపడుతాయన్న ఉద్దేశంతో.... అంజుం చేస్తున్న ప్రయత్నానికి.... రెయిన్ బో ట్రస్టు సహకారం అందిస్తోంది. అంజుం చేస్తున్న ప్రయత్నం.... పర్యావరణానికి మేలు చేయటంతో పాటు మహిళల ఆర్థిక స్వావలంబనకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: