బాపట్ల మండలం సూర్యలంక ఎస్సీ కాలనీకి చెందిన 9 ఏళ్ల బాలికపై.. ఓ యువకుడు అత్యాచారనికి యత్నించాడు. సముద్రతీరంలో తాబేళ్లు సంరక్షణ కేంద్రం వద్ద పనిచేస్తున్న గౌరీ శంకర్(27) మద్యం మత్తులో.. నిద్రిస్తున్న బాలికను తీసుకువెళ్లి అత్యాచారానికి యత్నించాడు. భయాందోళనతో బాలిక.. కేకలు వేయటంతో గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాలికను బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండీ.. తెలంగాణ: గో మహాగర్జనకు షరతులతో కూడిన అనుమతి