ETV Bharat / state

'తల్లిదండ్రులు మందలించారని యువకుడు బలవన్మరణం' - జీబీసీ రోడ్డులోని హెచ్​పీ గ్యాస్

ఇస్త్రీ పని చేసుకుంటూ మద్యానికి బానిసైన ఓ యువకుడ్ని కుటుంబ సభ్యులు మందలించడం కారణంగా విష గుళికలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కళ్ల ఎదుటే తమ కుమారుడు మరణించడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

'తల్లిదండ్రులు మందలించారని యువకుడు బలవన్మరణం'

author img

By

Published : Mar 30, 2021, 3:23 PM IST

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలుకు చెందిన రావూరి శివ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీపీసీ రోడ్డులోని హెచ్​పీ గ్యాస్ వెనుక విషపు గుళికలు తిని తెల్లవారుజామున ఆఘాయిత్యానికి ఒడిగట్టాడు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు నిడుబ్రోలు పీబీఎన్​ కాలేజీ రోడ్డులో నివసిస్తున్న రావూరి శివ ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

మద్యానికి బానిస..

మద్యానికి బానిసైన శివ తరచూ మందు తాగుతుండటంతో కుటుంబ సభ్యులతో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి కుటుంబీకులకు ఫోన్ చేసి తాను విషపు గుళికలు తిని చనిపోతున్నట్లు చెప్పడంతో.. నివాస పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా కనపడకపోవడంతో ఆందోళన చెందారు. స్వతాహగా శివ ధైర్యవంతుడు కావడంతో ఎలాంటి దారుణాలకు పాల్పడే అవకాశం లేదనే నమ్మకంతో తల్లిదండ్రులు ఉన్నారు.

పొలాల్లో అలా కనపడేసరికి..

ఈ నేపథ్యంలో తెల్లవారేసరికి జీబీసీ రోడ్డులోని హెచ్​పీ గ్యాస్ వెనుక ఉన్న పొలాల్లో కుమారుడు విగత జీవిగా పడి ఉండటంతో బాధితులు బోరున విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి

: వీఆర్వో వేధిస్తున్నాడని.. యువతి ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.