గుంటూరు జిల్లా తెనాలి మండలంలో జగ్గడిగుంట పాలెంలోని కొవిడ్ హెల్త్ కేర్ సెంటర్లో దాదాపు 700 మంది పైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వారి ఆహ్లాదం కోసం సాయంత్రం వేళ చిత్ర ప్రదర్శనలు చేస్తున్నారు.
ప్రతి రోజు ఉదయాన్నే..
కరోనా నియంత్రణలో భాగంగా యోగా గురువు పతంజలి శ్రీనివాస్ బాధితులతో యోగాసనాలు వేయిస్తున్నారు. రోజు ఉదయం 6.30 నిమిషాల నుంచి దాదాపు గంట సమయం వరకు యోగాసనాలు వేయించినట్లు యోగా గురువు తెలిపారు.
'యోగా : కరోనా నివారిణి'
యోగా శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ కూడా ఇవ్వనున్నట్లు సబ్ కలెక్టర్ వివరించారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ యోగాసనాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ ఆసనాలతోనే నిజమైన ఆరోగ్యం లభిస్తుందన్నారు. కుటుంబ సభ్యులతో పాటు తాను కూడా యోగ చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ వెల్లడించారు. యోగాతో కరోనాను కూడా జయించవచ్చని సూచించారు.
ఇవీ చూడండి : సాధువులు, ఖైదీలు, యాచకులందరికీ వ్యాక్సిన్!