ETV Bharat / state

గుంటూరులో ఘనంగా ఎర్రన్నాయుడి వర్ధంతి - గుంటూరులో ఎర్రన్నాయుడు వర్ధంతి వేడుకలు

గుంటూరు తెదేపా పార్లమెంట్ కార్యాలయంలో దివంగత నేత ఎర్రన్నాయుడి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పలువురు నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఘనంగా ఎర్రన్నాయుడు వర్ధంతి వేడుకలు
ఘనంగా ఎర్రన్నాయుడు వర్ధంతి వేడుకలు
author img

By

Published : Nov 2, 2020, 3:53 PM IST

తెదేపా సీనియర్ నాయకుడు, దివంగత నేత ఎర్రన్నాయుడు 8వ వర్ధంతి వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. గుంటూరు పార్లమెంట్ కార్యాలయంలో మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రవణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర, నసీర్ అహ్మద్​లు ఎర్రనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెదేపా పార్టీకి ఎర్రన్నాయుడు లేనిలోటు తీర్చలేనిదని నక్కా ఆనంద్​బాబు వ్యాఖ్యానించారు.

పార్టీకి ఆయన ఎనలేని కృషి చేశారని...,జిల్లాలో ఆయనకు తెలియని కార్యకర్త, నాయకులు లేరని, గుంటూరుతో ఎర్నన్నకు ప్రత్యేక అనుబంధం ఉందని తెనాలి శ్రవణ్ వెల్లడించారు. ఆయన స్ఫూర్తితో ప్రతి కార్యకర్త ముందుకు వెళ్లాలన్నారు.

అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా ?

వైకాపా అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు, అమరావతిలను సర్వ నాశనం చేసిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని భూములిచ్చిన రైతులు అలుపెరుగని పోరాటం చేస్తుంటే..వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని మండిపడ్డారు.

ఇదీచదవండి

మచ్చలేని చరిత్ర ఆయన సొంతం: తెదేపా అధినేత చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.