గుంటూరు జిల్లా తాడికొండ మండలం తాతిరెడ్డి పాలెంలో వైకాపా నేతలు పాదయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సంక్షేమ పథకాలే ఎజెండాగా జగన్ పాలన సాగుతోందని తెలిపారు.
‘వైఎస్సార్ జలకళ’
నిడుముక్కల గ్రామంలో వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి ప్రారంభించారు. రాష్ట్రంలో 13 జిల్తాల్లో అర్హులైన రైతులందరికీ.. ఉచిత బోర్ల ద్వారా సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆమె అన్నారు. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చూశారని తెలిపారు. రైతులకు అండగా నిలుస్తానని అప్పట్లో హామీ ఇచ్చారని.. నవరత్నాల్లో భాగమైన ఆ హామీని నెరవేర్చడం కోసం రూ.2340 కోట్లను కేటాయించారన్నారు. అలాగే రైతులకు ఉచితంగా వేసిన బోర్లతోపాటు ఉచితంగా మోటార్‌ను కూడా అందించనున్నట్లు వెల్లడించారు. ఉచితంగా మోటార్లను అందజేసేందుకు రూ.1600 కోట్లను కేటాయించిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.
ఇదీ చదవండి