సీఎం జగన్ పాదయాత్ర చేసి మూడేళ్లు గడిచిన సందర్భంగా సంఘీభావం తెలుపుతూ... గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లిలో స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాదయాత్ర నిర్వహించారు. పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. బాపూజీ కలగన్న గ్రామ స్వరాజ్యం దిశగా ఆయన పనిచేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ సచివాలయాలు ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా, జగనన్న విద్యా కనుక, వసతి దీవెన, అమ్మ ఒడి, మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్న ఘనత కేవలం వైకాపాకే దక్కుతుందన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి చేశామని తెలిపారు. బండారుపల్లిలోని ఎస్సీ కాలనీ నుంచి ప్రధాన సెంటర్ వరకు పాదయాత్ర కొనసాగింది.
రేపల్లెలో పాదయాత్రలో పాల్గొన్న ఎంపీ మోపిదేవి
ముఖ్యమంత్రి జగన్ పరిపాలన చూసి దేశంలోని సీనియర్ రాజకీయ నాయకులు సైతం అభినందిస్తున్నారని... రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేసి మూడేళ్లు పూర్తైన సందర్భంగా గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఇసుకుపల్లి నుంచి రింగ్ రోడ్ సెంటర్ వరకు పాదయాత్ర కొనసాగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.
ఇదీ చదవండి:
గుంటూరులో కిడ్నాప్ కలకలం... విచారణకు తీసుకెళ్లబోయామన్న పోలీసులు..