గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం చండ్రాజుపాలేనికి చెందిన వైకాపా నాయకుడు, మాజీ సర్పంచి గాదె వెంకటరెడ్డిని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. బెల్లంకొండ మండలం వైకాపా జెడ్పీటీసీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీకి దిగిన గాదె వెంకటరెడ్డి... కొద్ది రోజులుగా పార్టీలో తగిన గుర్తింపు లభించకపోవడంతో మనస్తాపానికి గురై తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
తన అనుచరులతో కలిసి హైదరాబాద్లో పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు బయలుదేరారు. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు వద్ద సుమారు నలభై మంది గుర్తుతెలియని వ్యక్తులు వెంకటరెడ్డిని అడ్డుకుని హైదరాబాద్ తరలించినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. చివరకు తాను క్షేమంగానే ఉన్నట్లు వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
ఇదీ చదవండి