గుంటూరు జిల్లా బాపట్లలో ఓ వైకాపా నేత వీరంగం సృష్టించాడు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతున్న జనసేన కార్యకర్తలను అడ్డుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న అతను... ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదని దౌర్జన్యం చేశాడు. ఇదేంటి అని ప్రశ్నించిన వ్యక్తిపై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి