ఎస్సీల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు తెలిపారు. ఇప్పటికే రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. సోమవారం గుంటూరు జిల్లా వినుకొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. సర్కార్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకే ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరగడం లేదని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో 90 శాతం ప్రభుత్వం పూర్తి చేసిందని వివరించారు. త్వరలో 2300 మంది ఎస్సీలకు రేషన్ పంపిణీ వాహనాలు ఇస్తామని కనకారావు వెల్లడించారు. అలాగే నవరత్నాలలో భాగంగా సుమారు 20 పథకాల ద్వారా రైతు సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు.
ఇదీ చదవండి