ETV Bharat / state

గణేష్ నిమజ్జనం చూస్తే... దాడులా?

వినాయకుని నిమజ్జనం చూస్తున్న ఓ వ్యక్తిపై... వైకాపా నాయకులు దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా కొమెరపూడిలో చోటుచేసుకుంది. నిందితులను శిక్షించాలని బాధితుడి బంధువులు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Sep 6, 2019, 10:22 PM IST

గణేష్ నిమజ్జనం చూస్తే... దాడులు చేస్తారా అంటూ బాధితుడి బంధువుల ఆందోళన
గణేష్ నిమజ్జనం చూస్తే... దాడులు చేస్తారా అంటూ బాధితుడి బంధువుల ఆందోళన

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో... తెలుగుదేశం పార్టీకి చెందిన మార్చల సాగర్​పై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గ్రామంలో వినాయకుని నిమజ్జనం గురువారం అర్ధరాత్రి జరిగింది. పనికి వెళ్లి అప్పుడే వచ్చిన మార్చల సాగర్... ట్రాక్టర్​ ఎక్కి వేడుకను చూస్తుండగా... వైకాపా నాయకులు సాగర్​పై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడినే పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లారని... నిందితులను ఏమి అనలేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తెదేపా మద్దతు దారులమనే ఉద్దేశంతోనే దాడికి పాల్పడ్డారని...బాధ్యులను కఠినంగా శిక్షించాలని బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదీ చూడండి: తెదేపా నేతల ఇళ్లపై వైకాపా కార్యకర్తల దాడి

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      :అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_47_06_Vinayaka_Uregimpu_AV_AP10004

Body:అనంతపురం జిల్లా కదిరిలో వినాయక నిమజ్జనం ఊరేగింపు నేత్రపర్వంగా సాగుతోంది. శ్రీ ఖాద్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన గౌరీ తనయుడు ప్రతిమ ముందు బయలుదేరగా వాటి వెనుక పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 135 విగ్రహాలు ఒకదాని వెనుక మరొకటి ఊరేగింపుగా సాగాయి. వినాయక మండపాల నిర్వాహకులు చిన్న పెద్ద తేడాలేకుండా నృత్యాలు చేస్తూ ప్రతిమల ముందు కోలాహలంగా ముందుకు సాగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. అదనపు ఎస్పీ చౌడేశ్వరి బందోబస్తును పర్యవేక్షించారు. ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఊరేగింపులు పాల్గొని యువతను ప్రోత్సహిస్తూ ముందుకు సాగారు. వినాయక నిమజ్జనం ఊరేగింపులో కాషాయ ధ్వజ లతో యువత ప్రతిమలకు ముందు సందడి చేశారు. వివిధ రకాల పాటలు, బాణసంచాతో పట్టణం మారుమోగింది

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.