ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్‌ను ప్రభుత్వం నియమించింది. విలీన ప్రక్రియలో దశలు, సూక్ష్మ వివరాలు అధ్యయనానికి ఓ బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ విలీన కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది. వీలీనంపై అధ్యయనం చేసిన ఆంజనేయ రెడ్డి కమిటీ ఇచ్చిన అన్ని సిఫార్సులను సత్వరం అమలు చేసేందుకు కార్యాచరణపై వర్కింగ్ గ్రూప్ పనిచేయనుంది. ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్ అసిస్టెంట్ సెక్రటరీ సీహెచ్ వెంకటేశ్వరరావు వర్గింగ్ గ్రూప్ కన్వీనర్‌గా ఉంటారు. ఆర్థిక, న్యాయ, పబ్లిక్ ఎంటర్‌ప్రైసెస్ డిపార్టు మెంట్, జీఏడీ అధికారులు, ఏపీఎస్‌ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు సహా మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఏర్పాటు చేసిన ఈ వర్కింగ్ గ్రూప్.. ఆర్టీసీ విలీనానికి సంబంధించి వివరణాత్మక అధ్యయనం చేస్తుంది. వివిధ విషయాలపై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. అధ్యయన కమిటీ సిఫార్సుల మేరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుడిపార్టు మెంట్‌ను సృష్టించడం, పోస్టుల సృష్టి , హోదాలు, పే స్కేల్స్, వివిధ వర్గాలకు వర్తించే సేవా పరిస్థితులు, ఉద్యోగులు, సీసీఏ రెగ్యులేషన్స్, చెల్లింపుల కోసం ఏపీసీఎఫ్‌ఎంఎస్‌లో ఎస్టాబ్లిష్మెంట్ విషయాలు స్వాధీనం చేసుకోవడం, వేతనాలు మొదలైన వాటి అధ్యయన వివరాలు, కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది. దీన్ని నవంబర్ 15లోపు ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాల్లో తెలిపారు..
ఇదీ చదవండి: