గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఏడు నెలలుగా హెల్త్ అలవెన్సులు ఇవ్వటం లేదని.. తక్షణమే అలవెన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హెల్త్ అలవెన్స్ నిధులు మంజూరైన.. మున్సిపల్ అధికారులు ఇవ్వటంలో జాప్యం చేస్తున్నారంటూ.. సీఐటీయూ పశ్చిమ గుంటూరు జిల్లా అధ్యక్షుడు సాల్మన్ మండిపడ్డారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి పారిశుద్ధ్య కార్మికుల మంచి కోరి రూ. 6వేలు మంజూరు చేస్తే.. అధికారులు దానిని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కరోనా కష్టకాలంలో తమ ఆరోగ్యాలను లెక్కచేయకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తే.. రావలసిన నిధులు అందించటంలో అధికారులు జాప్యం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.