ETV Bharat / state

లాక్​డౌన్ వేళ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు - ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు

లాక్ డౌన్ వేళ మద్యం అక్రమ అమ్మకాలు జోరందుకున్నాయి . కరోనా వ్యాప్తి చెందకుండా మూసేసిన మద్యం దుకాణాలతో పాటు ప్రైవేటు బార్ల నుంచి మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సోగుతోంది. ఒక్క గుంటూరు జిల్లాలోనే 96 లక్షల రూపాయల విలువైన మద్యం బయటికెళ్లింది. పోలీసు, ఎక్సైజ్ బృందాలు ఇటీవల జరిపిన సోదాల్లో బయటపడిన విషాయాలు నివ్వెరపరుస్తున్నాయి.

wine sale in lock down in ap
wine sale in lock down in ap
author img

By

Published : Apr 28, 2020, 1:35 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రధాని మోదీ మార్చి 22న జనతా కర్ప్యూకు పిలుపునిచ్చిన నాటి నుంచి ప్రభుత్వం మద్యం అమ్మకాలను నిలిపేసింది. దీంతో లాక్ డౌన్ వేళ మద్యానికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది.

అక్రమ దందా...

ఇదే అదునుగా ప్రభుత్వ మద్యందుకాణాలు, బార్లలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిచి.. మద్యం రవాణా, అమ్మకాలకు మొదలుపెట్టారు. ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని మూడింతలు రేట్లు పెంచి నల్లబజారులో విక్రయించారు. కొన్ని ప్రాంతాల్లో బెల్టు షాపులకూ వీటిని పంపిణీ చేశారు. నరసరావుపేట, చిలకలూరిపేట ఉదంతాల్లో ఎక్సైజ్ సిబ్బంది పాత్రపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం అక్రమ అమ్మకాలపై దృష్టి సారించింది.

ఒక్క జిల్లాలోనే 96 లక్షల మద్యం...

అబ్కారీ శాఖ అధికారులతోపాటు పోలీసులు, బెవరేజేస్ కార్పొరేషన్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇలా గుంటూరు జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో 96 లక్షల రూపాయల మద్యం పక్కదారి పట్టినట్లు అధికారికంగా గుర్తించారు. దీనికి మద్యం దుకాణాల సూపర్ వైజర్లతోపాటు, కొందరు సిబ్బంది పాత్రపైనా ఆరోపణలు వచ్చాయి. బెల్టుషాపులతోపాటు వివిధ ప్రాంతాల్లో మద్యం అక్రమ అమ్మకాలకు సంబంధించి అబ్కారీ అధికారులు 320 కేసులు నమోదు చేశారు.

తెలంగాణ నుంచి నాన్ డ్యూటీ లిక్కర్...

మరోవైపు తెలంగాణ నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అక్రమమద్యం రవాణాపై 16 కేసులు నమోదు చేశారు. లాక్ డౌన్ సమయంలో మూడు బార్ల లైసెన్సులు రద్దు చేసిన అధికారులు.... మరో 20 బార్ అండ్ రెస్టారెంట్ల పైన కేసులు నమోదు చేశారు. మద్యానికి తీవ్రకొరత ఏర్పడిన పరిస్థితుల్లో గుంటూరు జిల్లాలో నాలుగు మద్యం దుకాణాల్లో మద్యాన్ని కొల్లగొట్టారు.

ఇందులో మద్యం దుకాణాల పాత్రను పోలీసులు గుర్తించారు. మద్యం దుకాణాల్లో సోదాలు ఇప్పటికే పూర్తికాగా.. జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్లలో నిల్వలను తనిఖీ చేస్తున్నామని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్ ఛార్జ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ చెప్పారు. మద్యం అక్రమ అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టి అడ్డుకుంటున్నామని చెప్పారు.

నాటు సారాకు కొదవేలేదు...

మరోవైపు సారా తయారీ కేంద్రాలపైనా ప్రత్యేక దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా నాటుసారా తయారీ కేంద్రాలైన నిజాంపట్నం మండలం దిండి, అడవుల గ్రామాలు, బాపట్ల మండలం స్టువర్టుపురం, చినబేతపూడి, వెదుళ్లపల్లి, నరసరావుపేట మండలం చేజెర్ల తండా, ఇనిమెళ్ల అటవీప్రాంతం, వినుకొండ లాంటి అనేక మండలాలపై అధికారులు ప్రత్యేకదృష్టి సారించారు. తరచూ దాడులు నిర్వహిస్తున్న అధికారులు పెద్దఎత్తున సారా, నల్లబెల్లం స్వాధీనం చేసుకోవడంతోపాటు వేలాది లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేస్తున్నారు.

మద్యం అక్రమ అమ్మకాలు, సారా తయారీ కేంద్రాలపై దాడులు అంశాలపై , వాటి చర్యలపై అధికారులు సమగ్ర నివేదికను అందించనున్నారు.

ఇవీ చదవండి: 24 గంటల్లో దేశంలో 62 కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.