ETV Bharat / state

దారుణం: పింఛన్ డబ్బు కోసం భార్యను హత్య చేసిన భర్త

పింఛన్ డబ్బు ఇవ్వలేదని కోపంతో భార్యను కర్రతో కొట్టి చంపేశాడు భర్త. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం యలవర్రు గ్రామంలో జరిగింది.

Wife Murder by husband at guntur
దారణం: పింఛన్ డబ్బు కోసం భార్యను హత్య చేసిన భర్త
author img

By

Published : Nov 2, 2020, 8:28 PM IST

పింఛన్ డబ్బుల కోసం భార్యను భర్త చంపిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. అమర్తలూరు మండలం యలవర్రు గ్రామానికి చెందిన శామ్యూల్ తన భార్య ఏపరాయమ్మతో విభేదాల కారణంగా కొన్నేళ్లుగా వేరుగా ఉంటున్నాడు. అయితే ఆమెకు నెలనెలా పింఛన్ వస్తున్నందున శామ్యూల్ పెన్షన్​కు అనర్హుడుగా అధికారులు ప్రకటించారు. దీంతో వచ్చే పింఛన్​లో సగం తనకు ఇవ్వాలని ఇటీవల తరచూ గొడవ పడుతున్నాడు.

ఈ క్రమంలో ఈ నెల 1న ఆమెకు పింఛన్ వచ్చింది. సగం డబ్బు తనకు ఇవ్వాలని శామ్యూల్ అడిగాడు. ఆమె ఇవ్వటానికి నిరాకరించింది. ఫలితంగా కోపం పెంచుకున్న శామ్యూల్... ఇవాళ తెల్లవారుజామున ఏపరాయమ్మ ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేశాడు. కర్రతో విపరీతంగా కొట్టడం వల్ల ఆమెకు తీవ్రగాయాలు కాగా.... ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందింది.

అయితే కుటుంబసభ్యులు.. గుట్టుచప్పుడు కాకుండా ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. అంత్యక్రియలు నిలిపివేసి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూదవండి:

వేరొకరితో చనువుగా ఉంటుందని బ్లేడుతో గొంతు కోశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.