కొండవీడు ఘాట్‌రోడ్డు చెక్ పోస్టు పక్కన.. పాతకాలం నాటి దిగుడు బావి వెలుగు చూసింది. కట్టడం 100 అడుగుల పొడవు, వెనుక భాగంలో 25 అడుగులు వెడల్పు, 35 అడుగుల లోతు ఉంది. ఆ కట్టడాన్ని కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి సందర్శించారు.
క్రీ.శ 14 నుంచి 16వ శతాబ్ధాల మధ్య కాలంలో రెడ్డిరాజులు లేదా గోల్కొండ నవాబులు తాగునీటి అవసరాలకు దీన్ని నిర్మించి ఉంటారని అభిప్రాయపడ్డారు. కొత్తపాలెం సర్పంచి మొలమంటి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఈ కట్టడాన్ని గ్రామస్థులు కోనేరుగా పిలుస్తారని, చిన్నతనంలో అందులో తాను ఈత కొట్టానని గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: