గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురం గ్రామానికి చెందిన రాగాల వెంకట రాహుల్... వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో హవా కొనసాగిస్తున్నాడు. సమోవాలో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్ షిప్ పురుషుల విభాగపు పోటీల్లో సత్తా చాటాడు. 89 కేజీల విభాగంలో.. స్నేచ్, క్లీన్, జర్క్‌లో మొత్తం 325 కేజీలు ఎత్తి రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఆయన తండ్రి మధు ఒకప్పుడు మంచి క్రీడాకారుడిగా వెయిట్ లిఫ్టర్‌గా రాణించారు. తన కుమారులు అదే స్థాయిలో ఉండాలని ఆయన తపన పడ్డారు. ఆ ఆరాటమే... రాగాల వెంకట రాహుల్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. రాహుల్ సోదరుడు వరుణ్ కూడా అనేక వెయిట్ లిఫ్టింగ్‌లో అనేక పతకాలను సాధించాడు. తాజాగా వెంకట్ రాహుల్ మరోసారి రజత పతకం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి :