గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడు గ్రామంలో దేవాదాయశాఖకు చెందిన తాగునీటి చెరువులు ఉన్నాయి. అందులో ఒకటి గేదెల చెరువు. మరొకటి తాగునీటి చెరువు. తాగునీటి చెరువులో నీరు అడుగంటి దుర్వాసన వస్తోంది. ఫలితంగా నీటి ఇబ్బంది ఏర్పడింది. అయితే... గేదెల కోసం ఉపయోగించే చెరువులో ఉన్న నీటిని తాగునీటి చెరువులోకి మళ్లించడానికి దేవాదాయశాఖ అధికారి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని గ్రామస్థులు అడ్డగించడంతో.. ఆ అధికారి దాడికి ప్రయత్నించాడని గ్రామస్థులు వాపోయారు.
గ్రామ సమీపంలోని గేదెల చెరువులో కొన్నాళ్లక్రితం ఓ వ్యక్తి పడి చనిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో... 3రోజులు ఆ చెరువులోనే మృతదేహం ఉంది. చెరువులో శవాన్ని చూసిన గ్రామస్తులు.. ఆ నీటిని ఎలా తాగుతారని ప్రశ్నిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చే మురుగు నీటిని గతంలో ఈ చెరువులో నింపారని... శుద్ధి చేసినా దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరుతాగితే పిల్లలకు రోగాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఆనారోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
అయితే ప్రశ్నించిన వారిపై ఓ అధికారి దాడి చేసేందుకు ప్రయత్నించాడని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామీణ నీటి సరఫరాపై అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేయాలని కోరుతున్నారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండీ...