ఇది కూడా చదవండి.
తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి వైకాపా నేతల పయనం - tadepalli
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కార్యాలయం నేతలతో సందడిగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు గురువారం విడుదల కానున్నందున కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
జగన్ నివాసం
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నందన నేతలకు వైకాపా కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్న జగన్.. ఇక్కడి నుంచే ఇవాళ కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ నేతలు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. పార్టీ అధిష్ఠానం ఆదేశాల నేపథ్యంలో శాసన సభ, లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన నేతలు సహా ముఖ్యనేతలంతా తాడేపల్లి లోని పార్టీ కార్యాలయానికి బయలు దేరారు. నేతలందరికీ ఇక్కడే సదుపాయాలు కల్పించారు. ఫలితాల అనంతరం ఆధిక్యం పరంగా ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా జాగ్రత్తగా ఉండేందుకు వీలుగా పార్టీ నేతలను పిలిచినట్లు తెలుస్తోంది. ఫలితాలు వెలువడక ముందే కొందరు వైకాపా నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. విజయవాడ నుంచి తాడేపల్లి లోని పార్టీ కార్యాలయానికి వెళ్లే దారిలో కాబోయే ముఖ్యమంత్రి జగన్ అంటూ భారీ ఫ్లెక్లీలు ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున సంబరాలు చేసేందుకు సిద్దమవుతున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి వైకాపా నేతలతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఫలితాలను వెలువడిన తర్వాత తీర్పు స్పష్టంగా ఉంటుందని అనుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. జగన్ను జనం ఆశీర్వదిస్తారని నమ్ముతున్నట్లు ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఇది కూడా చదవండి.
Vadodara (Gujarat), May 22 (ANI): A crocodile had entered into a house in Raval village of Vadodara's Waghodia Taluka on Wednesday. It was rescued by wildlife rescue team. The crocodile was later released at a safe spot.
Last Updated : May 23, 2019, 7:28 AM IST