గుంటూరు జిల్లా మాచవరం మండలానికి చెందిన వేణు అనే రైతు.. తన నాయనమ్మకు చెందిన 1.70 సెంట్ల పొలాన్ని అడంగల్ కోసం జనవరిలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఈ పని పూర్తి చేయటానికి రూ.5000 లంచం ఇవ్వాలంటూ పిన్నెల్లికి చెందిన వీఆర్వో పిచ్చయ్య కోరగా.. రైతు వేణు గుంటూరులోని అవినీతి నిరోధక శాఖ అధికారులను కలిసి విషయాన్ని వివరించాడు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంబంధిత రికార్డులు స్వాధీనపరుచుకున్నారు. నిందితుడిని విజయవాడ అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు అనిశా అడిషనల్ ఎస్పీ సురేష్ బాబు తెలిపారు.
ఇదీ చదవండి: