గుంటూరు జిల్లాలో వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో ఓటర్ స్లిప్పులపై సంబంధిత ఓటరుకు ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలను రాసి పంచుతున్నారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ఈ స్లిప్పులను అందిస్తున్నారు.
వైకాపా మద్దతిస్తున్న అభ్యర్థికి ఓటు వేయకపోతే పథకాలకు ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. దీనిపై పోటీలో ఉన్న ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి ఆర్డీవో కార్యాలయంలోని అధికారులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: