ETV Bharat / state

'వర్చువల్‌ లోక్‌అదాలత్ లో కేసులు పరిష్కరించుకోండి'

author img

By

Published : Sep 18, 2020, 9:29 AM IST

గుంటూరు జిల్లాలో ఈ నెల 26న వర్చువల్‌ లోక్‌అదాలత్‌ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుమ్మడి గోపీచంద్‌ తెలిపారు. ఈమేరకు ఆయన పలు వివరాలు వెల్లడించారు.

Virtual Lok Adalat
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుమ్మడి గోపీచంద్

గుంటూరు జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఈ నెల 26న వర్చువల్‌ లోక్‌అదాలత్‌ ద్వారా పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుమ్మడి గోపీచంద్‌ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రాజీపడదగ్గ క్రిమినల్‌ కేసులు, సివిల్‌ కేసులు, ఎన్‌ఎ యాక్ట్‌లు, మోటారు వాహన ప్రమాద బీమా కేసులు, కార్మిక వివాదాలు, ఫ్రీ లిటిగేషన్‌ కేసులు ఈ అదాలత్‌ ద్వారా పరిష్కరించుకోచ్చన్నారు. వర్చువల్‌ లోక్‌ అదాలత్‌లో కక్షిదారుల వ్యక్తిగత హాజరు అవసరం లేకుండా ఇరుపక్షాల హాజరును వాట్సాప్‌, బ్లూజీన్స్‌ యాప్‌ వీడియో కాల్‌ ద్వారా నమోదు చేసి కేసులు రాజీ చేస్తామని వెల్లడించారు.

వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ ద్వారా ఎవరైనా కేసులు రాజీపడదలచుకుంటే ఈ నెల 21వ లోగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, గుంటూరుకు ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌, ఈమెయిల్‌ ద్వారా తెలియజేయవచ్చన్నారు. ఎస్‌ఎంఎస్‌ చేయాల్సిన నంబర్‌: 9440901048, వాట్సాప్‌ కోసం: 9705696694, dlsagnt@yahoo.com మెయిల్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

ఇవీ చూడండి...

'విగ్రహాల తొలగింపులో ఎమ్మెల్యే పాత్ర ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.