గుంటూరు జిల్లా వినుకొండ పురపాలక సంఘం మెుదటి సమావేశం జరిగింది. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. డ్రైనేజీ సమస్య పరిష్కారంతో పాటు శ్మశానాల అభివృద్ధి, ఘాట్ రోడ్డు, స్టేడియం నిర్మాణాల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
తాగునీటి సమస్యను అధికారులు పర్యవేక్షించి పరిష్కరించాలని ఆదేశించారు. నాలుగో వార్డు ఎన్ఎస్పీ కాలనీలోని నిరాశ్రయులను గుర్తించి న్యాయం చేయాలని సూచించారు. పట్టణంలోని వివిధ వార్డుల్లోని సమస్యలను వైకాపా కౌన్సిలర్లు ప్రస్తావించారు.
ఇదీ చదవండి: