Villagers Protest: జేపీ వెంచర్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తరలిస్తోందని.. గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గాజుల్లంక ఇసుక రీచ్ నుంచి అధిక మొత్తంలో ఇసుకను లారీల్లో తీసుకెళ్లడం వల్ల ఈ మార్గంలోని వంతెన ప్రమాదకర స్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
18 టన్నులతో వెళ్లాల్సిన లారీలు.. 38 టన్నుల ఇసుక లోడ్‌తో వెళ్లుతున్నాయని ఆరోపించారు. పరిసర గ్రామాల్లోని భూగర్భ జలాలు, పంట పొలాలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకుంటామని కొల్లూరు తాహశీల్దార్ శ్రీనివాసరావు ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళనను విరమిస్తామని గ్రామస్తులు తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి:
Students JAC protest: విభజన హామీలు నెరవేర్చాలి.. యువజన విద్యార్థి ఐకాస డిమాండ్