ETV Bharat / state

వీశాట్‌–2021కు అపూర్వ స్పందన: విజ్ఞాన్‌ వర్సిటీ  వైస్‌ ఛాన్స్‌లర్‌

వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీ 2021–22 విద్యా సంవత్సరానికి పలు కోర్సుల్లో ప్రవేశానికి ఆన్​లైన్​ పరీక్ష నిర్వహించారు. దీనికి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించిందని వర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ తెలిపారు.

vignan university
విజ్ఞాన్‌ యూనివర్సిటీ  వైస్‌ ఛాన్స్‌లర్‌
author img

By

Published : May 25, 2021, 8:49 AM IST

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీ 2021–22 విద్యా సంవత్సరానికి పలు కోర్సులకు సంబంధించి ప్రవేశాలకు ఆన్​లైన్​ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన లభించిందని వర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ (హాన్స్‌) అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీహెచ్‌డీ అడ్మిషన్లకు వీశాట్​ 2021 పేరుతో సోమవారం ఆన్​లైన్​ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

ఫీజు రాయితీలు:
ఈ నెల 30వ తేదీ వరకు వీశాట్‌–2021 పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నామని వైస్‌ ఛాన్స్‌లర్‌ తెలిపారు. వీశాట్‌–2021లో ప్రతిభ చూపిన వారికి ఫీజులో రాయితీ ఇవ్వనున్నట్లు చెప్పారు. తొలి 100లోపు ర్యాంకులు సాధించిన వారికి 75శాతం, 101–200లోపు ర్యాంకుల వారికి 50 శాతం, 201–400లోపు ర్యాంకుల వారికి 25 శాతం, 401 నుంచి 2వేల లోపు ర్యాంకు వారికి 10 శాతం రాయితీ అందజేస్తామని పేర్కొన్నారు. ఇంటర్‌ మార్కులు, జేఈఈ, మెయిన్స్, ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగానూ ఫీజు రాయితీ ఉంటుందన్నారు. అన్ని విభాగాల్లో 25 శాతం సీట్లను ఫీజు రాయితీ కింద కేటాయించామన్నారు. వాటిని పూర్తిగా ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తామని తెలిపారు. వీశాట్‌ పరీక్ష రాసిన వారికి బీటెక్‌ సీట్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.

కోర్సులు:
బీటెక్‌లో అగ్రికల్చర్, ఆటోమొబైల్, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మెటిక్స్, బయోమెడికల్, కెమికల్, సివిల్, సీఎస్‌ఈతో పాటు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ, బిజినెస్‌ సిస్టమ్స్, ఈసీఈ, ఈఈఈ, ఫుడ్‌ టెక్నాలజీ, ఐటీ, మెకానికల్, పెట్రోలియం ఇంజినీరింగ్, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, బీఫార్మసీ కోర్సులను అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్​తో పాటు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రయాణికులకు ఈ-పాస్ తప్పనిసరి : డీజీపీ సవాంగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.