గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం గోవాడలో వన మహోత్సవం ఉత్సాహంగా సాగింది. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిథులతో కలిసి వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మొక్కలు నాటారు. మొక్కల పెంపకంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీలతో సంబంధం లేకుండా గోవాడ గ్రామం ప్రగతి పథంలో పయనిస్తోందని కొనియాడారు.
గ్రామంలో పచ్చదనం పెంచేందుకు ముందుకు వచ్చిన రైతులు సుఖవాసి హరిబాబు, ఉప్పల సాంబశివరావును ఎమ్మెల్యే అభినందించారు. 2 కిలోమీటర్ల పొడవు, 120 అడుగుల వెడల్పు కలిగిన డొంకరోడ్డులో 58 రకాలకు చెందిన వెయ్యి అటవీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, మహిళలు, యువతీయువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇవీ చదవండి...