గుంటూరు అర్బన్ పరిధిలోని కంటైన్మెంట్ జోన్లను అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సందర్శించారు. ఆ ప్రాంతాల్లో తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలు, జాగ్రత్తల గురించి ఆరా తీశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని... బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించి, వ్యక్తిగత దూరం పాటిస్తూ.. శానిటైజర్లను ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. కంటైన్మెంట్ జోన్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదని, బయటి వ్యక్తులు ఎవరూ కంటైన్మెంట్ జోన్లలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. ప్రజలకు కావలసిన నిత్యావసరాలను సంబంధిత ప్రభుత్వ అధికారులే అందిస్తారని తెలిపారు.
ఇదీ చదవండి:
లాక్డౌన్లో టికెట్లు తీసుకున్న ఆర్టీసీ ప్రయాణికులకు నగదు వాపస్