Mansukh Mandaviya visit Mangalagiri AIIMS Hospital: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ పర్యటించారు. ఎయిమ్స్ వైద్యాధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆస్పత్రి ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు. ఆయుష్మాన్ పథకం అమలు తీరుపై అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను అధికారులు మంత్రికి వివరించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై చికిత్స కోసం వచ్చిన రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖ మంత్రి విడదల రజిని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్య సాధనలో ప్రజలే ప్రచారకర్తలు : నిర్మలా సీతారామన్
Mansukh Mandaviya Comments: పేదలను అభివృద్ధిలోకి తీసుకురావడమే వికసిత భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశమని డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ కేంద్రాన్ని, డ్రోన్ ద్వారా పంట పొలాలకు ఎరువులు, పురుగుల మందులను చల్లే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ యువతీ, యువకులు వ్యాపార అవసరాలకు బ్యాంక్ లోన్ కోసం ముద్ర లోన్ అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా దగ్గర అవడమే ధ్యేయం అని అన్నారు. రైతులకు నానో ఫైర్టిలైజర్స్ ద్వారా ఎరువులు అందించడం వల్ల నాణ్యమైన పంటలు పండించవచ్చని అన్నారు.
రాష్ట్రంలో కేంద్ర మంత్రులు పర్యటన-పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
Minister Vidada Rajini Comments: రాష్ట్ర మంత్రి విడదల రజిని మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న 11 మెడికల్ కాలేజీలలో ఐదు కాలేజీలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 8 వేల కోట్ల రూపాయలతో నూతన హాస్పిటల్స్ నిర్మాణం చేపట్టామని అన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా 90% కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల పరిధికి పెంచామని తెలిపారు. కేంద్రం సహకారంతో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను గ్రామస్థాయిలో అందజేసే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. వైద్య రంగంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తుందని అన్నారు.
సంగీతం, ఆంధ్ర సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలి - కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
BJP Leaders Angry on Rajini Comments: ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడే సమయంలో రాష్ట్రం గురించి మాట్లాడినప్పుడు జగనన్న పాలన అని కేంద్రం గురించి మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం అని మాత్రమే మాట్లాడారని బీజైపీ నాయకులు తప్పు పట్టారు. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ మోదీ గురించి కానీ మాట్లాడలేదని ఆరోపించారు. బీజైపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి ఆరోగ్యశ్రీ కార్డుకు గురించి మాత్రమే ప్రసంగించారని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆయుష్మాన్ భవ కార్డు గురించి ఎక్కడ ప్రస్తావించలేదన్నారు. దీనిపై సమాధానం చెప్పాలని మంత్రితో వాదనకు దిగారు. మంత్రి విడదల రజిని సమాధానం చెప్పకుండానే ప్రసంగాన్ని ముగించారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వివాదం ముగిసింది.