గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రాంతంలో ద్విచక్రవాహనాల దొంగతనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పొలాలకు వెళ్లే రైతుల వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. రైతులు రహదారి పక్కన బైక్ ఉంచి.. పొలంలోకి పనులకు వెళ్తుంటారు. వారు పనుల్లో ఉన్న సమయంలో వాహనాన్ని దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి భాగాలు వేరుచేసి అమ్మేస్తున్నారు.
లాక్ డౌన్ కాలంలోనే సత్తెనపల్లి, పెదకూరపాడు మండలాల్లో 50కి పైగా వాహనాలు చోరీకి గురయ్యాయి. దీనిపై కొందరు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. వాహనదారులే కొందరు తమ బైకుల కోసం వెదుకులాట ప్రారంభించగా... ఫ్రేములు మాత్రమే కనిపించాయి. అక్కడ పడిఉన్న నంబర్ ప్లేట్ ఆధారంగా అది తమ వాహనంగా యజమానులు గుర్తించాల్సిన పరిస్థితి. వాహనాల దొంగలకు ఎవరో బైక్ మెకానిక్ కూడా తోడు కావటం వల్లే విడిభాగాలు సులువుగా విప్పేసి అమ్మేసుకుంటున్నట్లు బాధితులు అనుమానిస్తున్నారు.
ఇదీచూడండి.