రెండు నెలల లాక్డౌన్ అనంతరం దేశంలో రైలు ప్రయాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఫలితంగా ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కళ సంతరించుకున్నాయి. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కి ఉదయం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. సికింద్రాబాద్ నుంచి రాత్రికి హౌరా ఎక్స్‌ప్రెస్ గుంటూరు స్టేషన్‌కి చేరనుంది. దీనికి అనుగుణంగా రైల్వే స్టేషన్లో అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
ముందస్తుగా ప్రయాణికులను తనిఖీ చేసేందుకు వీలుగా మొదటి ప్లాట్ ఫామ్‌పై ప్రత్యేక గదులను ఏర్పాటుచేశారు. టికెట్లు చేతికి తాకకుండా కంప్యూటర్ సాయంతో స్కాన్ చేసి రిజర్వేషన్ సదుపాయం ఉన్న వారిని స్టేషన్ లోపలికి అనుమతిస్తున్నారు. రైలు బయల్దేరే సమయానికి కనీసం గంట ముందే స్టేషన్‌కు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణికులు అందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని పేర్కొన్నారు. స్క్రీనింగ్ పరీక్ష అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ వారికి కేటాయించిన ప్రాంతాల్లో వేచి ఉండే విధంగా రైల్వే రక్షక దళం పర్యవేక్షిస్తున్నారు. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.