ETV Bharat / state

మహిళ హత్య కేసు: ఇద్దరు అరెస్టు - గుంటూరు మహిళ హత్యకేసులో ఇద్దరు నిందితులు అరెస్టు

గుంటూరు జిల్లా చెరుకుపల్లిలోని హత్యకు గురైన కొటారి సామ్రాజ్యం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు... మృతురాలితో అక్రమ సంబంధం పెట్టుకొని...ఆమె ఒంటిపై ఉన్న బంగారం కోసమే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మహిళ హత్యకేసులో ఇద్దరు నిందితులు అరెస్టు

author img

By

Published : Dec 6, 2020, 7:59 PM IST

గుంటూరు జిల్లా చెరుకుపల్లిలోని హత్యకు గురైన కొటారి సామ్రాజ్యం కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపేటలో నివాసముండే కొటారి సామ్రాజ్యం కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుండేది. ఆమెకు పోతర్లం శ్రీనివాసరావు అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. చెడు వ్యసనాలకు బానిసైన శ్రీనివాసరావు... అప్పుల పాలయ్యాడు. అవి తీర్చే మార్గం కనిపించక... సామ్రాజ్యం ఒంటిపై ఉన్న నగలపై కన్నేశాడు.

పథకం ప్రకారం సామ్రాజ్యాన్ని తన ద్విచక్రవాహనంపై బులుసుపాలెం, పోదిలవారి పాలెం గ్రామాల మధ్య ఉన్న కాలువ వద్దకు తీసుకెళ్లాడు. ఆమెకు కూల్​డ్రింక్​లో మత్తు మందు కలిపి స్పృహ తప్పేలా చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న ఐదున్నర తులాల బంగారాన్ని దోచుకొని.. పక్కనే ఉన్న కాలువలో పడేసి హత్య చేశాడు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి నిందితుడితో పాటు సహకరించిన అతని భార్యను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

ఉద్ధండరాయునిపాలెంలో దీక్షా శిబిరంపై రాళ్లదాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.